Tirupati: ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్ వేసింది
ABN , Publish Date - Feb 13 , 2025 | 04:59 AM
ఈ వ్యవహారంపై తాము ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరంలేదని హైకోర్టు పేర్కొంది. విచారణ గడువును 30 రోజులకే పరిమితం చేయాలని, నివేదికను గవర్నర్‌కు సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చింది.

మేము ఉత్తర్వులివ్వాల్సిన అవసరం లేదు
‘తిరుపతి తొక్కిసలాట’ పిల్‌పై హైకోర్టు ధర్మాసనం
అమరావతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట, భక్తుల మృతి వ్యవహారంపై విచారణ జరిపేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్ నియమించిన నేపథ్యంలో, ఈ వ్యవహారంపై తాము ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరంలేదని హైకోర్టు పేర్కొంది. విచారణ గడువును 30 రోజులకే పరిమితం చేయాలని, నివేదికను గవర్నర్‌కు సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చింది. గవర్నకు నివేదిక సమర్పించేలా నిబంధన ఏదీ చట్టంలో లేదని తెలిపింది. కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ చట్టం కింద కమిషన్ ఏర్పాటు చేసి, విచారణ గడువు నిర్దేశించడం పూర్తిగా ప్రభుత్వ విచక్షణాధికారమని పేర్కొంది. వ్యాజ్యాలను పరిష్కరించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటిరవితో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు ఇచ్చింది. కర్నూలు జిల్లాకు చెందిన గుదిబండ ప్రభాకర్‌రెడ్డి ఈ పిల్‌ను దాఖలు చేశారు. వ్యాజ్యంపై ఇటీవల వాదనలు ముగియంతో తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం బుధవారం నిర్ణయం వెల్లడించింది. మరోవైపు తొక్కసలాట వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణ కోరుతూ విజయవాడకు చెందిన వంగవీటి నరేంద్ర తాజాగా దాఖలు చేసిన పిల్‌కు కూడా అవే ఉత్తర్వులు వర్తిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..
Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం
Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి
Also Read: మరోసారి కుల గణన సర్వే
Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు
Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం
For AndhraPradesh News And Telugu News