High Court : అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వలేం
ABN , Publish Date - May 09 , 2025 | 06:05 AM
హైకోర్టు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఎలాంటి అరెస్ట్ నుంచి రక్షణ కల్పించే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ కేసులపై విచారణ జూన్ 16కి వాయిదా వేసింది
పిటిషన్ల విచారణ పరిధిని తేల్చడం వరకే మా అధికారం
కాకాణి గోవర్దన్‌రెడ్డికి స్పష్టం చేసిన హైకోర్టు
అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో దాఖలైన ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణపరిధిని తేల్చేవరకే తమ అధికారమని హైకోర్టు స్పష్టం చేసింది. నిందితులకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాన్న కాకాణి గోవర్దన్‌రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది అభ్యర్థనను తోసిపుచ్చింది. వ్యాజ్యాలపై విచారణను జూన్ 16కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.సురేష్‌రెడ్డి, జస్టిస్ వి.సుజాతతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది.