Share News

KA Paul Deposit: రూ.5లక్షలు జమ చేయండి

ABN , Publish Date - May 08 , 2025 | 05:56 AM

సీబీఐ విచారణకు పిల్‌ వేసిన కేసులో కేఏ పాల్‌ రూ.5 లక్షలు హైకోర్టులో జమ చేయాలని ఆదేశించింది. వేసవి సెలవుల తర్వాతే విచారణ జరపనున్నట్లు బెంచ్‌ తెలిపింది

KA Paul Deposit: రూ.5లక్షలు జమ చేయండి

  • కేఏ పాల్‌కు హైకోర్టు స్పష్టీకరణ

అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): పాస్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మృతిపై దర్యాప్తును సీబీఐకి అప్పగించేలా ఆదేశించాలంటూ వేసిన పిల్‌ విషయంలో హైకోర్టు రిజిస్ట్రీ వద్ద రూ.5లక్షలు జమ చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ను హైకోర్టు ఆదేశించింది. ఆ తరువాతే పిల్‌పై విచారణ చేపడతామని స్పష్టంచేసింది. విచారణను వేసవి సెలవుల తరువాతకి వాయిదా వేసింది. ఈ మేరకు చీఫ్‌జస్టిస్‌ జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవిల బెంచ్‌ ఉత్తర్వులు ఇచ్చింది. పాస్టర్‌ మరణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ కేఏపాల్‌ పిల్‌ దాఖలు చేశారు. పార్టీ ఇన్‌ పర్సన్‌ కేఏ పాల్‌ వాదనలు వినిపించారు. సీబీఐ విచారణకు వెంటనే ఆదేశించకుంటే సీసీ టీవీ ఫుటేజీ భద్రపరిచేలా పోలీసులకు సూచించాలని కోరారు. సీసీటీవీ ఫుటేజీ 3నెలల్లో డిలీట్‌ అవుతుందని తెలిపారు. అలాగని మీకుఎవరు చెప్పారని, వాస్తవాలు తెలియకుండా వాదనలు చేయొద్దని బెంచ్‌ హెచ్చరించింది. పిల్‌ను సదుద్దేశంతో వేశారని నిరూపించుకొనేందుకు 5లక్షలు జమ చేయాలని కేఏ పాల్‌ను ఆదేశించింది.

Updated Date - May 08 , 2025 | 05:56 AM