ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలి
ABN , Publish Date - Jan 08 , 2025 | 12:16 AM
ప్లాస్టిక్ నిషేఽధానికి ప్రతి ఒక్కరూ సహకరిం చాలని డోన డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు.
డోన డీఎస్పీ శ్రీనివాస్
బనగానపల్లె, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ప్లాస్టిక్ నిషేఽధానికి ప్రతి ఒక్కరూ సహకరిం చాలని డోన డీఎస్పీ శ్రీనివాస్ అఽన్నారు. మం గళవారం బనగానపల్లె పోలీస్‌స్టేషన ఆవరణ లో సీఐ ప్రవీనకుమార్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించా రు. దుస్తుల యజమానులు, కిరాణా దుకాణం యజమానులు, బేకరీ యజమానులు, కూరగా యల వ్యాపారులు తదితర వ్యాపారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. డీఎస్పీ శ్రీనివాస్ మా ట్లాడుతూ బనగానపల్లె పట్టణంలో మంత్రి బీసీ జనార్దనరెడ్డి, ఆయన సతీమణి బీసీ ఇంది రమ్మలు పట్టణం పరిశుభ్రంగా ఉంచేందుకు, ప్రజలు క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహ న కల్పిస్తున్నారన్నారు. ప్రతి వ్యాపారి ఇందుకు సహకరించాలన్నారు. బనగానపల్లె నుంచే ప్లాస్టిక్‌నిషేధంపై మార్పులు రావాలన్నారు. ప్లాస్టిక్ ఎక్కడిక్కడ వేయడం వల్ల మూగ జీవాలు ప్లాస్టిక్‌ను తిని మృతి చెందుతున్నా యని ఇది బాధాకరమన్నారు. అలాగే చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. పిల్లల ను చిన్నప్పట్నుంచే సైకిల్ తొక్కేది నేర్పించా లన్నారు. బనగానపల్లె పట్టణంలో ప్లాస్టిక్ నిషేధం సక్సెస్ అయితే జిల్లా వ్యాప్తంగా అమ లులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వివిధ వ్యాపార వర్గాలు, పో లీస్ సిబ్బంది పాల్గొన్నారు.