Share News

శివరాత్రికి భారీ భద్రత: ఎస్పీ

ABN , Publish Date - Feb 08 , 2025 | 12:02 AM

మండలంలోని కాటకోటేశ్వరక్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకుని ఎలాంటి సమస్యలు రాకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎస్పీ రత్న తెలిపారు.

శివరాత్రికి భారీ భద్రత: ఎస్పీ
ఆలయ కమిటీ సభ్యులతో మాట్లాడుతున్న ఎస్పీ

తాడిమర్రి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): మండలంలోని కాటకోటేశ్వరక్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకుని ఎలాంటి సమస్యలు రాకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎస్పీ రత్న తెలిపారు. శుక్రవారం మండలంలోని చిల్లవారిపల్లి కాటకోటేశ్వరస్వామిని దర్శించుకు న్నారు. ఆలయ విశిష్టత, ఉత్సవాల నిర్వహణ గురించి ఆలయ కమిటీ సభ్యులతో ఆరా తీశారు. అందరూ విభేదాలు వీడి ఉత్సవాలు ప్రశాంతం గా సాగేందుకు సహకరించాలని, ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం స్థానిక పోలీ్‌సస్టేషనను పరిశీలిం చారు. ఎస్పీ వెంట ధర్మవరం డీఎస్పీ హేమంత కుమార్‌, ముదిగుబ్బ రూరల్‌ సీఐ శ్యామరావు, ఎస్బీ ఎస్‌ఐ ప్రదీ్‌పకుమార్‌, ఎస్‌ఐ క్రిష్ణవేణి ఉన్నారు.

Updated Date - Feb 08 , 2025 | 12:02 AM