Share News

AP weather: బంగాళాఖాతంలో అల్పపీడనం

ABN , Publish Date - Apr 08 , 2025 | 04:40 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడే అవకాశములేదని నిపుణులు చెబుతున్నారు. దీంతో వాయవ్య గాలుల ప్రభావంతో ఎండలు పెరిగే అవకాశముంది; అక్కడక్కడ వర్షాలు, ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే సూచనలున్నాయి.

AP weather: బంగాళాఖాతంలో అల్పపీడనం
AP Weather Report

  • బలపడే అవకాశం లేదంటున్న నిపుణులు

  • రానున్న 3 రోజుల్లో పెరగనున్న ఎండలు

  • నేడు, రేపు పలుచోట్ల పిడుగులతో వానలు

విశాఖపట్నం, అమరావతి, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి) మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడే అవకాశం లేదని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. అయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే సమయంలో వాయువ్య భారతం నుంచి వచ్చే వేడిగాలులు అల్పపీడనం దిశగా వీస్తాయన్నారు. దీంతో వచ్చే మూడు రోజుల్లో ఎండలు మరింత పెరుగుతాయని పేర్కొన్నారు. మరోవైపు వేర్వేరుగా ఉపరితల ద్రోణుల విస్తరణతో కోస్తా, రాయలసీమల్లో సోమవారం అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వానలు కురుస్తాయని, ఈదురుగాలులకు ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడు పేర్కొన్నారు. అలాగే, ఈ నెల 10, 11 తేదీల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాగా, సోమవారం నంద్యాల సహా పలుచోట్ల 41 డిగ్రీలు దాటి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


ఇవి కూడా చదవండి..

TGSRTC: ఎండీకి నోటీసులు.. మోగనున్న సమ్మె సైరన్

Vaniya Agarwal: మైక్రోసాఫ్ట్‌ను అల్లాడించిన వానియా అగర్వాల్ ఎవరు

Rains: ఓరి నాయనా.. ఎండలు మండుతుంటే.. ఈ వర్షాలు ఏందిరా

Student: వారం పాటు.. వారణాసిలో దారుణం..

Mamata Banerjee: హామీ ఇస్తున్నా.. జైలుకెళ్లేందు సిద్ధం..

Nara Lokesh: ‘సారీ గయ్స్‌..హెల్ప్‌ చేయలేకపోతున్నా’: మంత్రి లోకేశ్‌

LPG Price Hiked: పెరిగిన సిలిండర్ ధర.. ఎంతంటే..

Updated Date - Apr 08 , 2025 | 07:56 AM