Andhra Pradesh heatwave: రాష్ట్రం నిప్పుల కొలిమి
ABN , Publish Date - Apr 24 , 2025 | 04:28 AM
రాష్ట్రంలో వాయవ్య గాలుల ప్రభావంతో ఎండ తీవ్రత పెరిగింది. నంద్యాల జిల్లా గోనవరంలో 44 డిగ్రీలతో సీజన్‌లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవగా, రానున్న మూడు రోజులు ఎండ తీవ్రత, చెదురుమదురుగా వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
నంద్యాల జిల్లా గోనవరంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత
మరో మూడు రోజులు ఎండలే
విశాఖపట్నం, అమరావతి, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగింది. వాయవ్య దిశ నుంచి వచ్చే పొడిగాలుల ప్రభావంతో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎక్కువ ప్రాంతాల్లో వేడి వాతావరణం కొనసాగింది. అక్కడక్కడ వడగాడ్పులు వీచాయి. పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ సీజన్‌లో తొలిసారిగా బుధవారం నంద్యాల జిల్లా గోనవరంలో 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా గొల్లవిడిపిలో 43.8, కడప జిల్లా మద్దూరులో 43.6, నంద్యాలలో 43 డిగ్రీలు, కర్నూలు జిల్లా తోవిలో 42.9, పల్నాడు జిల్లా నర్మలపాడులో 42.8, నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 42.5, జంఘమహేశ్వరపురం, కడపల్లో 42.6, కర్నూలులో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని 135 ప్రాంతాల్లో 41 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు కోస్తా, రాయలసీమల్లో ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, ఛత్తీ్‌సగఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో బుధవారం కోస్తాలో అక్కడక్కడ ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కాగా, గురువారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, జిల్లాల్లోని 30 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, మరో 29 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులతో కూడిన అకాల వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..