Headmistress Suspended: విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న హెచ్‌ఎం సస్పెన్షన్
ABN , Publish Date - Nov 05 , 2025 | 05:57 AM
విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ప్రధానోపాధ్యాయురాలిని అధికారులు సస్పెండ్ చేశారు.
మెళియాపుట్టి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ప్రధానోపాధ్యాయురాలిని అధికారులు సస్పెండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి ఆశ్రమ పాఠశాలలో హెచ్‌ఎం వై.సుజాత ఫోన్‌లో మాట్లాడుతూ కొంతమంది విద్యార్థినులతో తరచూ కాళ్లు పట్టించుకుంటూ ఉండేవారు. అంతేకాకుండా కాళ్లు కుర్చీలో పెట్టుకుని మొబైల్ ఫోన్ చూస్తుండేవారు. ఈ వీడియోలు సొషల్ మీడియాలో వైరల్ కావడంతో మంగళవారం ఆమెను సస్పెండ్ చేసినట్టు సీతంపేట ఐటీడీఏ పీవో పవర్ స్వప్నిల్ జగన్నాథ్ తెలిపారు. టెక్కలి ఆర్డీవోతో పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తున్నట్టు ఐటీడీఏ పీవో తెలిపారు.