High Court: సచివాలయాల హేతుబద్ధీకరణపై పిటిషన్
ABN , Publish Date - Jun 24 , 2025 | 04:49 AM
గ్రామ, వార్డు సచివాలయాలను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా హేతుబద్ధీకరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోలను సవాల్ చేస్తూ విలేజ్ హార్టీకల్చర్ అసిస్టెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.సురేంద్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కౌంటర్ వేయాలని అధికారులకు హైకోర్టు ఆదేశం
అమరావతి, జూన్ 23(ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయాలను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా హేతుబద్ధీకరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోలను సవాల్ చేస్తూ విలేజ్ హార్టీకల్చర్ అసిస్టెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.సురేంద్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపారు. కౌంటర్ వేయాలని ప్రతివాదులుగా ఉన్న వ్యవసాయ, ఉద్యానవనశాఖల ముఖ్యకార్యదర్శులు, గ్రామ-వార్డు సచివాలయాలశాఖ కార్యదర్శి, ఉద్యానవనశాఖ కమిషనర్ తదితరులకు నోటీసులు జారీ చేశారు. పిటిషనర్ సంఘం సమర్పించిన వినతిపై నిర్ణయం తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయ కమిషనర్‌కు స్పష్టం చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది జీవీ శివాజీ వాదనలు వినిపించారు.