High Court: చట్టానికి లోబడే దర్యాప్తు జరగాలి
ABN , Publish Date - Apr 22 , 2025 | 05:40 AM
విశ్రాంత పోలీసు అధికారి బాలసుబ్రహ్మణ్యంరెడ్డిని అక్రమంగా తరలించిన పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వయసు పైబడినవారి వాంగ్మూలం వారి నివాసంలోనే నమోదు చేయాలన్న చట్ట నిబంధనలను గుర్తు చేస్తూ, చట్టాన్ని పాటించాలని స్పష్టం చేసింది.

60 ఏళ్లు పైబడినవారిని ఇంటి వద్ద విచారించాలి
ఉల్లంఘనపై వివరణ ఇవ్వండి
సిట్ అదనపు ఎస్పీకి హైకోర్టు ఆదేశం
అమరావతి, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): కేసుల దర్యాప్తు చట్టనిబంధనలకు లోబడే జరగాలని హైకోర్టు స్పష్టం చేసింది. బీఎన్‌ఎ్‌సఎస్ చట్టం సెక్షన్ 179 ప్రకారం 60ఏళ్లు పైబడిన, అనారోగ్య సమస్యలతో బాధపడే సాక్షులు, నిందితుల వాంగ్మూలాలను వారి ఇంటి వద్దే రికార్డు చేయాలని స్పష్టంగా ఉం దని గుర్తు చేసింది. తిరుపతికి చెందిన విశ్రాంత పోలీసు అధికారి టి.బాలసుబ్రహ్మణ్యంరెడ్డిని నిర్బంధించి విజయవాడకు తరలించడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆయన వయసు 60 ఏళ్లకుపైబడి ఉందని తెలిపింది. ‘ఆయనపై ఉన్న కేసు ఏంటి.. ఏ కేసులో సాక్షిగా పిలిచారు? కేసులో కుమారుడు నిందితుడిగా ఉంటే.. విచారణకు రావాలని తండ్రికి నోటీసులు ఎలా ఇస్తారు? పోలీసు శాఖలో పనిచేసి పదవీవిరమణ చేసిన అధికారితో ప్రవర్తించేది ఇలాగేనా’ అని ప్రశ్నించింది. కేసుల దర్యాప్తు నిలిపివేయాలని తాము చెప్పడం లేదని, అదే సమయంలో వ్యక్తుల స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపింది. ఏ చట్టనిబంధనలను అనుసరించి సిట్ ముం దు హాజరుకావాలని ఆయనకు నోటీసులిచ్చారని దర్యాప్తు అధికారి అయిన సిట్ అదనపు ఎస్పీని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఆయన్ను ఆదేశిస్తూ కేసులో సుమోటో ప్రతివాదిగా చేర్చింది. కోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు హాజరుకావాలని సుబ్రహ్మణ్యంరెడ్డికి ఎలాంటి నోటీసులూ జారీ చేయవద్దని స్పష్టం చేసింది.
ఆయన వాంగ్మూలం అవసరమని భావిస్తే ఆయన నివాసంలోనే రికార్డు చేయాలని, ఆ సమయంలో దర్యాప్తు అధికారి మినహా ఇతర పోలీసు అధికారులు ఉండడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. కోర్టు అనుమతి లేకుండా సుబ్రహ్మణ్యంరెడ్డి ఇంటిని పోలీసులు సందర్శించడానికి వీల్లేదని పేర్కొంది. విచారణను 28వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందనరావు నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. బాలసుబ్రహ్మణ్యంరెడ్డిని ఈ నెల 16న రాత్రి 11.50 గంటలకు తిరుపతిలోని ఆయన ఇంటి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారని, ఆయన ఆచూకీ తెలుసుకొని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఆయన బంధువు మేకా వెంకటరామిరెడ్డి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం.. అక్రమ నిర్బంధం ఆరోపణలపై వాస్తవాలు తేల్చేందుకు తమ ముందు హాజరుకావాలని బాలసుబ్రహ్మణ్యంరెడ్డిని ఆదేశించింది. ఆయన సోమవారం నేరుగా కోర్టు ముందు హాజరయ్యారు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న తన కుమారుడు ఈశ్వర్ కిరణ్‌కుమార్‌రెడ్డికి నోటీసు ఇచ్చేందుకు పోలీసులు వచ్చారని.. కుమారుడు తమతో ఉండడం లేదని వారికి చెప్పానని తెలిపారు. తనను నిర్బంధించి పోలీసు వాహనంలో విజయవాడ తరలించారని.. సిట్ బృందంలోని ఓ డీఎస్పీ తనను దూషించారని కన్నీరు పెట్టుకున్నారు. 17న వాం గ్మూలం నమోదు చేశాక తను పంపించి వేశారన్నారు. ఎప్పుడు ఎవరు వచ్చి అరెస్టు చేస్తారో అని భయంగా ఉందని తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ.. బాలసుబ్రహ్మణ్యంరెడ్డిని విచారణకు పిలిచి వాంగ్మూలం నమోదు చేశామన్నారు. ప్రస్తుతం ఆయన స్వేచ్ఛగా ఉన్నారని.. మరోసారి విచారణకు పిలువబోమని, పిలవాలనుకుంటే చట్టనిబంధనలు అనుసరిస్తామని తెలిపారు. పిటిషనర్ చేసిన ఆరోపణలను అఫిడవిట్ రూ పంలో సమర్పిస్తే కౌంటర్ దాఖలు చేస్తామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Post Office: ఏమిటి.. ఇన్నీ మంచి పథకాలా..
10th Class Result: 10వ తరగతి పరీక్ష ఫలితాలు.. విడుదల ఎప్పుడంటే..
Business: ఈ పథకంలో జస్ట్ రూ. 45 పెట్టుబడిగా పెట్టండి.. రూ. 25 లక్షలు మీ సొంతం
Rs 500 Notes: రూ. 500 నోట్లపై కీలక అప్ డేట్: కేంద్రం వార్నింగ్
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మృతి.. స్పందించిన ప్రధాని మోదీ
వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ (21-04-2025) సోమవారం మృతి చెందారు.
RVNL: దేశంలోనే తొలిసారి... అతిపొడవైన 14.57 కి.మీ.సొరంగం పూర్తి
For More Andhra Pradesh News and Telugu News..