ఘనంగా యోగి వేమన జయంతి
ABN , Publish Date - Jan 19 , 2025 | 11:22 PM
శ్రీయోగివేమన జయంతి వేడుకలు మండలంలోని కటారుపల్లిలో విశ్వ వేమన కొండ వద్ద, ఆలయం వద్ద ఆదివారం ఘనంగా నిర్వహించారు.
గాండ్లపెంట, జనవరి 19(ఆంధ్రజ్యోతి): శ్రీయోగివేమన జయంతి వేడుకలు మండలంలోని కటారుపల్లిలో విశ్వ వేమన కొండ వద్ద, ఆలయం వద్ద ఆదివారం ఘనంగా నిర్వహించారు. విశ్వవేమన కొండ వద్ద వేమన విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అలాగే సమాధిని పలువురు భక్తులు దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహించాల్సిన వేమన జయంతిని ఎలాంటి సంస్కృతిక కార్యక్రమాలు, హంగు, ఆర్భాటాలు లేకుండా నిర్వహించడంపై భక్తులు, తెలుగు భాషాభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటరామిరెడ్డి, ఈఓఆర్డీ, పంచాయతీ కార్యదర్శులు, దాసిరెడ్డి, భక్తులు పాల్గొన్నారు.