Share News

ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

ABN , Publish Date - Jan 25 , 2025 | 11:41 PM

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించారు. ధర్మవరం ఆర్డీఓ కార్యాలయంలో ఎక్కువసార్లు ఓటుహ క్కు వినియోగించుకున్న వృద్ధులను ఆర్డీఓ మహేష్‌ సత్కారించారు.

ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం
ధర్మవరం : ఎక్కువసార్లు ఓటు హక్కు వినియోగించుకున్న వృద్ధులను సన్మానిస్తున్న ఆర్డీఓ

ధర్మవరం/రూరల్‌, జనవరి 25(ఆంధ్రజ్యోతి): జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించారు. ధర్మవరం ఆర్డీఓ కార్యాలయంలో ఎక్కువసార్లు ఓటుహ క్కు వినియోగించుకున్న వృద్ధులను ఆర్డీఓ మహేష్‌ సత్కారించారు. నూతన ఓటర్లకు ఓటరు కార్డులను అందజేశారు. ధర్మవరంలోని కెహెచ ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ప్రిన్సిపల్‌ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో, పద్మావతి మహిళ డిగ్రీ కళాశాలలో జన విజ్ఞాన వేధిక రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ ఆదిశేషు ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో సచివాలయ ఉద్యోగులకు కబడ్డీ, క్రికెట్‌ పోటీలు నిర్వహిం చారు. విజేతలకు మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమోద్‌కుమార్‌ బహుమతులు అందజేశారు.

కదిరిఅర్బన : బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎంఎల్‌ పార్థసారధి నివాసంలో సంవిధాన దివస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళ్లు అర్పించారు. పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఆర్డీ ఓ వీవీఎస్‌ శర్మ ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. సీనియర్‌ సిటిజన్లనుసన్మానించారు.

Updated Date - Jan 25 , 2025 | 11:41 PM