Liquor Scam: కసిరెడ్డి రిమాండ్ ఉత్తర్వులపై పిటిషన్
ABN , Publish Date - Apr 26 , 2025 | 05:33 AM
మద్యం కుంభకోణంలో అరెస్టైన రాజ్ కసిరెడ్డిని విడుదల చేయాలంటూ ఆయన తండ్రి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదివరకు ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు 10 రోజుల కస్టడీకి అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
అమరావతి, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డికి రిమాండ్ విధిస్తూ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించి, రద్దు చేయాలని కోరుతూ ఆయన తండ్రి ఉపేందర్‌రెడ్డి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యర్థించడంతో, ధర్మాసనం లంచ్‌మోషన్‌గా విచారణకు స్వీకరించింది. విచారణ ప్రారంభమైన వెంటనే ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) టి.విష్ణుతేజ స్పందిస్తూ.. పిటిషన్ కాపీ తమకు అందలేదన్నారు. లంచ్‌మోషన్ సమాచారం కూడా తమ వద్ద లేదన్నారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం నిందితుడు రాజ్ కసిరెడ్డి ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారని, పిటిషన్‌పై సోమవారం విచారణ జరుపుతామని స్పష్టంచేసింది.
కసిరెడ్డిని పది రోజులు కస్టడీకి ఇవ్వండి.. సిట్ పిటిషన్
విజయవాడ, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డిని పది రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డిస్టలరీ కంపెనీల నుంచి వసూలు చేసిన డబ్బులు ఎక్కడెక్కడకు ఏయే మార్గాల ద్వారా వెళ్లాయో రాబట్టడానికి ఆయన్ను విచారించాలని నివేదించారు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..