FiberNet Chairman GV Reddy : ఎంఎస్ఓల సమస్యలు పరిష్కరిస్తాం
ABN , Publish Date - Jan 23 , 2025 | 04:42 AM
రాష్ట్రంలో ఫైబర్ నెట్ సేవలను విస్తరించేందుకు వీలుగా మల్టీపర్పస్ సర్వీస్ ఆపరేటర్ (ఎంఎస్ఓ)ల సమస్యలను పరిష్కరిస్తామని సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలోని రాష్ట్ర ఫైబర్‌నెట్ ప్రధాన కార్యాలయంలో ఎండీ దినేశ్ కుమార్‌తో పాటు ఎంఎ్‌సఓలతో
స్మార్ట్ టీవీలు లేనివారికి ఐపీ బాక్సులు: ఫైబర్‌నెట్ చైర్మన్ జీవీ రెడ్డి
అమరావతి, జనవరి 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఫైబర్ నెట్ సేవలను విస్తరించేందుకు వీలుగా మల్టీపర్పస్ సర్వీస్ ఆపరేటర్ (ఎంఎస్ఓ)ల సమస్యలను పరిష్కరిస్తామని సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలోని రాష్ట్ర ఫైబర్‌నెట్ ప్రధాన కార్యాలయంలో ఎండీ దినేశ్ కుమార్‌తో పాటు ఎంఎ్‌సఓలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫైబర్‌నెట్ సంస్థ తీరుపై ఎంఎ్‌సఓలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సెట్ టాప్, ఐపీ బాక్సులకు నెలకు రూ.59 రెంటల్ వసూలు, కమిషన్ చెల్లింపు వంటి సమస్యలను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెటాప్ బాక్సుల స్థానంలో యాప్‌ను తీసుకురావడం వల్ల స్మార్ట్ టీవీలు లేని వినియోగదారులకు సేవలు అందని పరిస్థితి నెలకొందని వారు తెలిపారు. దీనిపై దినేశ్‌కుమార్, జీవీరెడ్డి మాట్లాడుతూ... ‘సెట్‌టాప్ బాక్సులను పూర్తిగా నిలిపివేయడం లేదు. సాధారణ టీవీ వినియోగదారులందరికీ సెట్ టాప్ బాక్సులు అందిస్తాం. అదేవిధంగా సెట్ టాప్ బాక్సు ధర రూ.5,000ను నెలవారీ రెంటల్ రూ.59 రూపంలో వసూలు చేసేవాళ్లం. మొత్తం చెల్లింపు పూర్తయిన తరువాత కూడా గత ప్రభుత్వంలో వాయిదాలు కొనసాగిస్తూ వచ్చారు. ఇలా అధిక మొత్తంలో వసూలు చేసిన సొమ్మను ఎంఎ్‌సఓలకు వాపస్ ఇస్తాం. ఎస్‌ఎంఓలను వేధించేలా పంపిన డిమాండ్ నోటీసుల సమస్యను పరిష్కరి స్తాం. ఎంఎ్‌సఓల నుంచి ఫైబర్‌నెట్ సిబ్బంది డబ్బులు వసూలు చేసినట్లు రుజువైతే క్రమశిక్షణా చర్యలు తీవ్రంగా ఉంటాయి’ అని హెచ్చరించారు.