CM Chandrababu: బిగ్ రిలీఫ్.. చంద్రబాబు కేసు మూసివేత
ABN , Publish Date - Dec 01 , 2025 | 06:54 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్ లభించింది. చంద్రబాబుపై గత జగన్ ప్రభుత్వ హయాంలో నమోదైన ఎక్సైజ్ కేసును ఏసీబీ కోర్టు సోమవారం మూసివేసింది.
విజయవాడ, డిసెంబరు1 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు (CM Chandrababu Naidu) బిగ్ రిలీఫ్ లభించింది. చంద్రబాబుపై గత జగన్ ప్రభుత్వ హయాంలో నమోదైన ఎక్సైజ్ కేసును ఏసీబీ కోర్టు ఇవాళ(సోమవారం) మూసివేసింది. ఫిర్యాదు చేసిన వారు నిరభ్యంతర పత్రం ఇప్పటికే న్యాయస్థానానికి అందజేశారు. సీఐడీ అధికారుల దర్యాప్తును అంగీకరించి కేసును క్లోజ్ చేసింది ఏసీబీ కోర్టు.