Share News

Deepti: అమెరికాలో ఘోరం.. గుంటూరు విద్యార్థిని దీప్తి మృత్యువాత

ABN , Publish Date - Apr 18 , 2025 | 10:29 PM

ఆంధ్రప్రదేశ్ గుంటూరుకు చెందిన దీప్తి అమెరికాలోని నార్త్ టెక్సాస్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది. మేలో ఆమె చదువు పూర్తవుతుంది. అయితే, ఇంతలోనే..

Deepti: అమెరికాలో ఘోరం.. గుంటూరు విద్యార్థిని దీప్తి మృత్యువాత
Andhra Pradesh student Deepti killed in hit and run in US

Andhra Pradesh Student Killed in US : ఆంధ్రప్రదేశ్ గుంటూరుకు చెందిన వి. దీప్తి అనే యువతి అమెరికాలో అసువులు బాసింది. దీప్తి అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది. టెక్సాస్‌లో జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదంలో దీప్తి ప్రాణాలు కోల్పోయింది. దీప్తి ప్రాణాలను బలిగొన్న దుర్ఘటన టెక్సాస్ లోని డెంటన్‌లో జరిగింది. మే నెలలో ఆమె చదువు పూర్తయిపోతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

24 ఏళ్ల విద్యార్థిని దీప్తి ఏప్రిల్ 12న కారిల్ అల్ లాగో డ్రైవ్‌లోని 2300 బ్లాక్ సమీపంలో తన స్నేహితురాలితో కలిసి ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా, వేగంగా వచ్చిన వాహనం వారిని ఢీకొట్టి అక్కడి నుండి వేగంగా వెళ్లిపోయింది. దీంతో దీప్తి తలకు తీవ్ర గాయాలై ఏప్రిల్ 15న మరణించగా, ఆమె స్నేహితురాలు స్నిగ్ధ గాయాల పాలై శస్త్రచికిత్స చేయించుకుంటోంది. అయితే, ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

మృతురాలు దీప్తి ఉత్తర టెక్సాస్ విశ్వవిద్యాలయంలో తన మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది. మరో నెలలో జరిగే దీప్తి కాలేజ్ కాన్వొకేషన్ కు హాజరు అవుదామనుకుంటుంటే ఇలా జరిగిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. చాలా కాలంగా కన్న కలలు ఒక్కసారిగా కల్లలుగా మారిపోయాయని వారు కన్నీరు మున్నీరవుతున్నారు. "నేను అప్పుడే దీప్తితో మాట్లాడాను. కాలేజ్ కు వెళ్లే తొందరలో ఉన్నానని ఆదివారం ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తానని చెప్పింది. అదే చివరి కాల్ అయింది" అని ఆమె తండ్రి హనుమంత రావు అన్నారు.

తమ కుమార్తె చదువు కోసం ఎన్నో త్యాగాలు చేసిందని, ఆమెను ఉన్నత చదువుల కోసం US కు పంపడానికి తమ వ్యవసాయ భూములను కూడా అమ్మేశామని దీప్తి తండ్రి చెప్పారు. కాగా దీప్తి మృతదేహాన్ని ఇండియాకు రప్పించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీప్తి డెడ్ బాడీ సోమవారం హైదరాబాద్ కు చేరుకుంటుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించి అవసరమైన అధికార ప్రక్రియ, ఏర్పాట్లను సమన్వయం చేయడంలో US లోని తెలుగు సంఘాలు సహాయం చేస్తున్నాయి. నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల నుండి BTech గ్రాడ్యుయేట్ అయిన దీప్తి ఎల్లప్పుడూ విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలని కోరుకునేది. అయితే, అదే ఆమెను తిరిగిరాని లోకాలకు చేర్చడం చాలా బాధాకరం.


ఇవి కూడా చదవండి..

Murshidabad Violence: రాష్ట్రం తగులబడుతుంటే ఆ ఎంపీ ఏమైనట్టు?

India: బెంగాల్ ఘటనలపై బంగ్లా అనుచిత వ్యాఖ్యలు.. ఖండించిన భారత్..

PM Modi-Elon Musk: ఎలాన్ మస్క్‌తో టెక్ సహకారంపై మాట్లాడిన ప్రధాని మోదీ

Updated Date - Apr 18 , 2025 | 10:29 PM