Share News

Borugadda Anil: బోరుగడ్డకు 3 వరకు రిమాండ్‌

ABN , Publish Date - May 21 , 2025 | 04:08 AM

పెదకాకాని మండల సర్వేయర్‌ను బెదిరించిన కేసులో గుంటూరు కోర్టు రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ రిమాండ్‌ను వచ్చే నెల 3 వరకు పొడిగించింది. అతడి బెయిల్ పిటిషన్‌ను కూడా నరసరావుపేట కోర్టు తిరస్కరించింది.

Borugadda Anil: బోరుగడ్డకు 3 వరకు రిమాండ్‌

గుంటూరు/నరసరావుపేట లీగల్‌, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో ఉన్న గుంటూరు జిల్లా పెదకాకాని మండల సర్వేయర్‌ను దూషించి, బెదిరించిన కేసులో రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌కు గుంటూరు కోర్టు వచ్చే నెల 3 వరకు రిమాండ్‌ విధించింది. 2016 మే 9న సర్వేయర్‌ చిరుమామిళ్ల మల్లికార్జునరావును బెదిరించిన ఘటనపై అప్పట్లో పెదకాకాని స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పటి నుంచి బోరుగడ్డ కోర్టుకు గైర్హాజవుతున్నాడు. దీంతో కోర్టు ఆయనకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ప్రస్తుతం బోరుగడ్డ అనంతపురం జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. పెదకాకాని పోలీసులు పిటీ వారెంట్‌పై గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. ఆరో కోర్టు మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచాల్సి ఉండగా.. ఆ మెజిస్ట్రేట్‌ సెలవులో ఉండటంతో ఇన్‌చార్జి అయిన నాలుగో కోర్టు మెజిరేస్టట్‌ శోభారాణి ఎదుట హాజరుపరిచారు. బోరుగడ్డకు మేజిస్ట్రేట్‌ రిమాండ్‌ విధించడంతో అతడిని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. కాగా, బోరుగడ్డ అనిల్‌ బెయిల్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తూ మంగళవారం నరసరావుపేట రెండవ అదనపు జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఎం.గాయత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఫిరంగిపురం పోలీస్‌ ేస్టషన్లో నమోదైన కేసులో బోరుగడ్డను మార్చి24న కోర్టులో హాజరుపరచగా.. న్యాయాధికారి రి మాండ్‌ విధించారు. అప్పటినుంచిదాన్ని పొడిగిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్

Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే

Read Latest AP News And Telugu News


Updated Date - May 21 , 2025 | 04:08 AM