Pending Payments: ఉపాధి పాత బిల్లుల చెల్లింపులకు గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Jul 28 , 2025 | 05:05 AM
గత టీడీపీ ప్రభుత్వం(2014-19)లో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఉపాధి పథకం పనులను కేంద్రం రీఓపెన్ చేయడంతో ఆయా బిల్లులను అప్‌లోడ్ చేసేందుకు అవకాశం ఏర్పడింది.
అమరావతి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): గత టీడీపీ ప్రభుత్వం(2014-19)లో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఉపాధి పథకం పనులను కేంద్రం రీఓపెన్ చేయడంతో ఆయా బిల్లులను అప్‌లోడ్ చేసేందుకు అవకాశం ఏర్పడింది. ఈ పనులకు సంబంధించి 30 రోజులు రీఓపెన్ స్థితిలో ఉంటాయని, ఆయా బిల్లులను అప్‌లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కృష్ణతేజ అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు. నమోదైన కాంట్రాక్టర్లకు పీఎఫ్ఎంఎస్ ద్వారా మెటీరియల్ చెల్లింపులు చేయాలన్నారు. ఐఎఫ్ఎస్‌సీ ఐడీలో కాంట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ సమయంలో ఉన్న ఖాతా నంబర్, ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్ ఒకేలా ఉండాలన్నారు. గత టీడీపీ హయాంలో జరిగిన ఉపాధి హామీ పనులను వైసీపీ సర్కార్ వచ్చిన వెంటనే రద్దు చేసి, బిల్లులు చెల్లించకుండా నిలిపేసి విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో ఈ పనులను తిరిగి ఓపెన్ చేస్తూ కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ‘కంప్లీటెడ్’ నుంచి ’ఆన్‌గోయింగ్’ స్థితికి మారుస్తూ ఎన్‌ఆర్‌ఈజీఏ సాఫ్ట్‌వేర్‌లో మార్చారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ గ్రీన్ సిగ్నల్.. ప్రధానంగా ఈ రంగాల్లో
బద్వేల్‌లో ఉప ఎన్నిక.. ఆదినారాయణరెడ్డి ఏమన్నారంటే..
Read latest AP News And Telugu News