గొట్లూరులో వైభవంగా మహాంకాళమ్మ ఉత్సవాలు
ABN , Publish Date - Jan 21 , 2025 | 01:34 AM
మండలంలోని గొట్లూరులో వెలసిన మహాంకాళమ్మ 13వ వార్షికోత్సవం, గ్రామోత్సవ వేడుకలను సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ధర్మవరంరూరల్, జనవరి 20(ఆంధ్రజ్యోతి): మండలంలోని గొట్లూరులో వెలసిన మహాంకాళమ్మ 13వ వార్షికోత్సవం, గ్రామోత్సవ వేడుకలను సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామపెద్దల ఆధ్వర్యంలో ఏటా సంక్రాంతి పండుగ తర్వాత మహాంకాళమ్మ ఉత్సవాలను నిర్వహిస్తారు. అమ్మవారి మూలవిరాట్‌ను ఆలయ పూజారి కాటమయ్య రకరకాల పూలతో, వెండిగొడుగులతో అలంకరించారు. ఉత్సవాలు సందర్భంగా ఆలయంలో 500మందికిపైగా ముత్తైదువులకు ఒడిబియ్యం అందజేశారు. ఈ ఉత్సవాలకు ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా కడప, నెల్లూరు, కర్ణాటక జిల్లాలకు చెందిన భక్తులు పెద్దఎత్తున హాజరయ్యారు. రాత్రి మహాంకాళమ్మ అమ్మవారిని వెండిరథఽంపై ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు.