Share News

ఘనంగా వైట్‌ఫీల్డ్‌ ఆస్పత్రి వార్షికోత్సవం

ABN , Publish Date - Jan 19 , 2025 | 11:17 PM

శ్రీసత్యసాయి సూపర్‌ ఆస్పత్రి బెంగుళూరు 24వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఘనంగా వైట్‌ఫీల్డ్‌ ఆస్పత్రి వార్షికోత్సవం
పాటలు పాడుతున్న వైద్యసిబ్బంది

పుట్టపర్తి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి సూపర్‌ ఆస్పత్రి బెంగుళూరు 24వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం సాయికుల్వంతు సభామండపంలో వైట్‌ఫీల్డ్‌ ఆస్పత్రి సిబ్బంది సత్యసాయి మహాసమాధికి ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం ఆస్పత్రి సేవల గురించి సిబ్బంది వివరించారు. సత్యసాయి ప్రేమతత్వంపై భక్తిగీతాలు ఆలపించారు. అనంతరం మహాసమాధిని దర్శించుకున్నారు.

Updated Date - Jan 19 , 2025 | 11:17 PM