Rathotsavam: వైభవం.. రాఘవేంద్రుడి రథోత్సవం
ABN , Publish Date - Aug 13 , 2025 | 04:14 AM
మంత్రాలయం రాఘవేంద్రస్వామి 354వ సప్తరాత్రోత్సవాల్లో ఐదో రోజు అత్యంత ప్రాముఖ్యమైన ఉత్తారాధనలో ,...
మంత్రాలయం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్రస్వామి 354వ సప్తరాత్రోత్సవాల్లో ఐదో రోజు అత్యంత ప్రాముఖ్యమైన ఉత్తారాధనలో భాగంగా మంగళవారం మహా రథోత్సవం ఘనంగా సాగింది. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు మూల బృందావనానికి విశేష పూజలు చేసి మహా మంగళహారతులు ఇచ్చారు. సర్వాభరణ అలంకృతుడైన ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను సంస్కృత పాఠశాల వరకు ఊరేగించి తిరిగి శ్రీమఠానికి తీసుకువచ్చారు.
