Share News

Srikalahasti: వైభవంగా వాయులింగేశ్వరుడి ధ్వజారోహణం

ABN , Publish Date - Feb 23 , 2025 | 05:43 AM

స్వామివారి గర్భాలయం ఎదురుగా ఉన్న స్వర్ణతాపడ ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, ధ్వజారోహణ క్రతువును శాస్ర్తోక్తంగా నిర్వహించారు.

Srikalahasti: వైభవంగా వాయులింగేశ్వరుడి ధ్వజారోహణం

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా వాయులింగేశ్వరుడి ధ్వజారోహణ ఘట్టం శనివారం సాయంత్రం వైభవంగా జరిగింది. స్వామివారి గర్భాలయం ఎదురుగా ఉన్న స్వర్ణతాపడ ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, ధ్వజారోహణ క్రతువును శాస్ర్తోక్తంగా నిర్వహించారు. కొడి వస్త్రాలను ధ్వజస్తంభానికి అధిరోహింపజేసి సకల దేవతలకు ఆహ్వానం పలికారు. భక్తుల శివనామస్మరణతో ఆలయం మార్మోగింది.

Updated Date - Feb 23 , 2025 | 05:44 AM