Swarna Andhra 2047: అర్థమవుతోందా.. సీఎం సార్!?
ABN , Publish Date - Feb 13 , 2025 | 04:22 AM
మరి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘స్వర్ణాంధ్ర-2047’ విజన్ డాక్యుమెంటును సామాన్యుల భాషలో ఎందుకు రూపొందించలేదు? తెలుగులో ఎందుకు అందుబాటులోకి తేలేదు?

జనంలోకి వెళ్లని ‘స్వర్ణాంధ్ర-2047’ పత్రం.. ప్రపంచస్థాయి ఇంగ్లి్‌షతో తంటాలు
పాలనా వ్యవహారాలు సామాన్యులకు కూడా అర్థం కావాలంటూ జీవోలను తెలుగులో ఇస్తున్నారు. మరి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘స్వర్ణాంధ్ర-2047’ విజన్ డాక్యుమెంటును సామాన్యుల భాషలో ఎందుకు రూపొందించలేదు? తెలుగులో ఎందుకు అందుబాటులోకి తేలేదు?
ఇటీవలి కాలంలో సీఎం చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టిన ప్రతిసారీ స్వర్ణాంధ్ర-2047 గురించి మాట్లాడుతున్నారు. కానీ.. అందులో ఏం ఉందో డాక్యుమెంట్ తయారు చేసిన కన్సల్టెన్సీకి, ఆ బాధ్యత చూసుకుంటున్న అధికారులకు తప్ప మరెవ్వరికీ అర్థం కావడం లేదు.
ఐఏఎ్‌సలకే అర్థంకాని పదజాలం
విద్యాసంస్థల్లో చర్చలు జరపాలన్న సీఎం
మాకే తలకెక్కలేదు.. జనానికి ఏం చెబుతాం!?
తలలు పట్టుకుంటున్న అధికారులు
ఇలాగైతే ప్రభుత్వ లక్ష్యం ప్రజలకు చేరేదెలా?
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ స్థాయి ఇంగ్లిషు... ఫక్తు కన్సల్టెంట్ పదజాలం... పీహెచ్‌డీ థీసిస్ తరహా వాక్యాలు! గులకరాళ్లలాంటి కఠినమైన భాష! ఇదీ... ‘స్వర్ణాంధ్ర-2047’ డాక్యుమెంట్ తీరు! ‘వికసిత్ భారత్’ లక్ష్యానికి సమాంతరంగా రాష్ట్రాన్నీ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘స్వర్ణాంధ్ర 2047’ పేరుతో ఒక విజన్ బుక్ తయారు చేయించారు. మంచిదే... లక్ష్యాలు ఉన్నతమైనవే! కానీ... ప్రభుత్వ ఉద్దేశాలు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో మాత్రం విఫలమయ్యారు. ఈ డాక్యుమెంట్‌పై జిల్లా, మండల స్థాయిలో చర్చ జరగాలని... పాఠశాలల్లోనూ విద్యార్థులకు అవగాహన కల్పించాలని... ప్రజాభిప్రాయాలూ తెలుసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. డాక్యుమెంట్‌లో ఉన్న 10 సూత్రాలను అంశాల వారీగా గ్రామస్థాయిలో ప్రజల్లో చర్చకు పెట్టాలని ప్రజాప్రతినిధులను పలుమార్లు ఆదేశించారు. ఒకరికి చెప్పాలంటే... వీళ్లకు అర్థం కావాలి కదా! అందుకే... 230 పేజీల విజన్ డాక్యుమెంట్‌ను అర్థం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నించారు.
కానీ... ఆ ప్రయత్నంలో విఫలమయ్యారు. ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థలు కేపీఎంజీ, బీసీజీ (బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్) రూపొందించిన ఈ డాక్యుమెంట్ ప్రపంచ స్థాయి ఇంగ్లిష్ భాషతో అధికారులను, ప్రజాప్రతినిధులను హడలగొడుతోంది. ప్రతి పేజీలో అర్థం కాని పదజాలంతో కన్సల్టెంట్లు తమ భాషా పరిజ్ఞానం చాటుకున్నారు. సామాన్యుల విషయం అటుంచింతే... ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులకు కూడా అర్థం కాని పరిస్థితి.
2020లో ఇలా...: చంద్రబాబు అప్పట్లో విజన్-2020 విడుదల చేశారు. అది కూడా ప్రపంచ బ్యాంకు ‘భాష’లో ఉన్నప్పటికీ ప్రజలకు కొంత దగ్గరైంది. ఇప్పుడు ‘స్వర్ణాంధ్ర-2047’ దీనికి పూర్తి భిన్నంగా ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
రాసినోళ్లకే ఎరుక: సాధారణంగా ప్రభుత్వం తాను ప్రచారం చేయదలుచుకున్న అంశాలను సరళంగా, పంచ్‌లైన్లతో,ప్రాసలతో తయారుచేయిస్తుంది.కానీ స్వర్ణాంధ్ర-20 47 డాక్యుమెంట్‌లో ఉన్న భాషను అర్థం చేసుకోలేక అధికారులు,ప్రజాప్రతినిధులు తంటాలు పడుతున్నారు. మీడియాకైనా అర్థమయ్యేలా వివరించి ఉంటే అసలు ఉద్దేశం ప్రజలకు చేరేది. దానిపై వ్యక్తమయ్యే భిన్నాభిప్రాయాలు ప్రభుత్వానికి తెలిసేవి. ఇప్పుడు ఆ అవకాశమే లేకుండా పోయింది. విజన్ డాక్యుమెంట్‌లో వ్యవసాయం గురించి రాసుకొచ్చారు. కానీ, ఆ రంగం అభివృద్ధికి ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోందో రైతులకు అర్థంకాదు. ఎనర్జీ రంగంలో చేపట్టాల్సిన ప్రాజెక్టుల గురించి రాసేందుకు వాడిన భాష ఇనుప గుగ్గిళ్లలా జీర్ణం కానే కాదు!
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..
Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం
Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి
Also Read: మరోసారి కుల గణన సర్వే
Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు
Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం
For AndhraPradesh News And Telugu News