Share News

Government Hospitals: ఆస్పత్రుల్లో పరిశుభ్రత పెంచాలి

ABN , Publish Date - Feb 13 , 2025 | 05:22 AM

బుధవారం అమరావతి సచివాలయంలో 256 ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాసుపత్రుల సేవల పట్ల రెండు విడతల్లో ఐవీఆర్‌ఎస్‌ ద్వారా సేకరించిన ప్రజాభిప్రాయ వివరాల్ని ఆయన వారికి తెలిపారు.

Government Hospitals: ఆస్పత్రుల్లో పరిశుభ్రత పెంచాలి

సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకోవాలి

ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, అధికారులతో స్పెషల్‌ సీఎస్‌

అమరావతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): ‘ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిశుభ్రత మెరుగుపరచాలి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయిలో ప్రభుత్వాసుపత్రుల పనితీరుపై నిరంతరం సమీక్ష జరుగుతోంది’ అని ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎం.టి.కృష్ణబాబు అన్నారు. బుధవారం అమరావతి సచివాలయంలో 256 ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాసుపత్రుల సేవల పట్ల రెండు విడతల్లో ఐవీఆర్‌ఎస్‌ ద్వారా సేకరించిన ప్రజాభిప్రాయ వివరాల్ని ఆయన వారికి తెలిపారు. ‘ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న అంశాల్లో అనతి కాలంలో సానుకూలత సాధించాలి. లేకుంటే ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, అడ్మినిస్ట్రేటర్లపై కఠిన చర్యలు ఉంటాయి. మొదటి దఫా అభిప్రాయ సేకరణ జనవరి 27న జరగ్గా, రెండవ అభిప్రాయ సేకరణ ఈ నెల 7న జరిగింది. మొత్తం ఆరు అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ జరగ్గా, 5 అంశాలకు సంబంధించి ప్రజల్లో సానుకూలత మెరుగయ్యింది. పరిశుభత్ర బాగాలేదన్న వారి సంఖ్య మొదటి సర్వేలో 33 శాతం, రెండో సర్వేలో 59 శాతం వచ్చింది. ఈ ఐవీఆర్‌ఎస్‌ సర్వేపై చంద్రబాబు సమీక్షించి ఆస్పత్రుల్లో పరిశుభ్రత మెరుగుపరచాలని చెప్పారు. ప్రభుత్వాసుపత్రులను సీఎం స్వయంగా సందర్శించి వాస్తవాల్ని గమనించి రోగుల అభిప్రాయాల్ని తెలుసుకోనున్నారు. తదుపరి సర్వే సమయానికి ఆసుపత్రుల్లో పరిశుభ్రత పెంచాలి. సానుకూల ఫలితాలు సాధించే దిశగా సూపరింటెండెంట్లు సమర్థ నాయకత్వాన్ని ప్రదర్శించాలి. రెవెన్యూ విభాగాల్లో దీర్ఘకాల అనుభవం ఉన్న అడ్మినిస్ట్రేటర్లు వారి సామర్థ్యాన్ని చూపాలి’ అని కృష్ణబాబు సూచించారు.


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..

Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం

Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి

Also Read: మరోసారి కుల గణన సర్వే

Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు

Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 13 , 2025 | 05:28 AM