Governor Abdul Nazeer: జాతి నిర్మాణంలో విద్యకు అధిక ప్రాధాన్యం
ABN , Publish Date - Sep 12 , 2025 | 06:43 AM
జాతి నిర్మాణంలో విలువలతో కూడిన విద్య గొప్ప ప్రాధాన్యతను సంతరించుకుందని రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా...
గవర్నర్ అబ్దుల్ నజీర్
మంగళగిరి సిటీ, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): జాతి నిర్మాణంలో విలువలతో కూడిన విద్య గొప్ప ప్రాధాన్యతను సంతరించుకుందని రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కురగల్లు గ్రామంలోని అమృత విశ్వ విద్యాపీఠం తొలి స్నాతకోత్సవం గురువారం జరిగింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యఅతిథిగా పాల్గొని గ్రాడ్యుయేట్లకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు నిత్యం నేర్చుకుంటూనే ఉండాలని.. ఎక్కడికి వెళ్లినా, ఏ పని చేసినా కొత్త విషయాలను నేర్చుకోవడంపై దృష్టి సారించాలని సూచించారు. భౌతికంగా అనేక వస్తువులు వస్తూ పోతూ ఉంటాయని, నేర్చుకున్న విజ్ఞానం మాత్రం శాశ్వతంగా నిలిచిపోతుందని చెప్పారు. మాతా అమృతానందమయి దేవి మానవతా దృక్పథం ద్వారా మార్గనిర్దేశం చేసిన సంస్థలో డిగ్రీలు పూర్తిచేసిన విద్యార్థులను ఆయన అభినందించారు. మాతా అమృతానందమయి మఠం ప్రధాన కార్యదర్శి స్వామి పూర్ణామృతానంద పూరి మాట్లాడుతూ విద్య, కరుణ ఆధారిత పరిశోధనలు అనే లక్ష్యంతో అమృత విద్యాపీఠం పనిచేస్తుందన్నారు.