Eagle teams: గంజాయికి చెక్... బడులపై ఈగల్ నిఘా!
ABN , Publish Date - Feb 26 , 2025 | 05:59 AM
మంగవాళవారం అసెంబ్లీ లాబీల్లో ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు ఐజీ ఆకే రవికృష్ణ నేతృత్వంలో ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

అమరావతి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పరిసరాలను నిరంతరం పర్యవేక్షించేందుకు ఈగల్ బృందాలను వినియోగంచనున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. మంగవాళవారం అసెంబ్లీ లాబీల్లో ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు ఐజీ ఆకే రవికృష్ణ నేతృత్వంలో ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మ హిళల భద్రతకు శక్తి పేరిట ప్రత్యేక యాప్‌ను పునరుద్ధరిస్తున్నామన్నారు.