Share News

Nellore : రిజిస్ర్టేషన్ల శాఖ డీఐజీ కిరణ్‌ సస్పెన్షన్‌

ABN , Publish Date - Feb 26 , 2025 | 06:16 AM

కిరణ్‌ తన భార్యను వేధిస్తున్నట్టు గుంటూరులోని అరండల్‌పేటలో ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని,

 Nellore : రిజిస్ర్టేషన్ల శాఖ డీఐజీ కిరణ్‌ సస్పెన్షన్‌

భార్య ఫిర్యాదుతో ప్రభుత్వం చర్యలు

అమరావతి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖలో నెల్లూరు డీఐజీగా ఉన్న వి.కిరణ్‌కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కిరణ్‌ తన భార్యను వేధిస్తున్నట్టు గుంటూరులోని అరండల్‌పేటలో ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని, గౌరవప్రదమైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ అనైతిక చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆయన భార్య కూడా ఫిర్యాదు చేసినట్టు జీవోలో పేర్కొన్నారు. సస్పెన్షన్‌ కాలలో అనుమతి లేకుండా కిరణ్‌ కుమార్‌ హెడ్‌క్వార్టర్స్‌ వదిలివెళ్ల కూడదని ఆదేశించారు.

Updated Date - Feb 26 , 2025 | 06:27 AM