MSME: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాయితీలు
ABN , Publish Date - Apr 25 , 2025 | 04:40 AM
ఎంఎ్‌సఎంఈ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పారిశ్రామికవేత్తలకు రాయితీలు అందిస్తోంది. విజయవాడలో నిర్వహించిన ఇంటర్నేషనల్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ మీట్‌లో ఆయన ప్రసంగించారు.
అమరావతి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): పరిశ్రమల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఎంఎ్‌సఎంఈ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పలు రాయితీలు అందజేస్తూ ఎంఎ్‌సఎంఈలను ప్రోత్సహిస్తోందని చెప్పారు. ప్రపంచ బ్యాంకు సహకారంతో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్స్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఐఈవో), ఎంఎ్‌సఎంఈడీసీ, ర్యాంప్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం విజయవాడలో ఇంటర్నేషనల్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శివశంకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేవారికి మానవ వనరులకు, సహజ వనరులకు కొదవ లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఐఈవో సౌత్ రీజియన్ జాయింట్ డైరెక్టర్ జనరల్ కె.ఉన్నికృష్ణన్, ఎఫ్‌ఐఈవో అసిస్టెంట్ డైరెక్టర్ రఘునాథ్‌బాబు పాల్గొన్నారు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..