Share News

టీ హైకోర్జు జడ్జీలకు ‘రాష్ట్ర అతిథులు’గా గుర్తింపు

ABN , Publish Date - Jan 02 , 2025 | 02:59 AM

రాష్ట్రంలోని హైకోర్టు జడ్జీలకు ఇచ్చే ప్రాధాన్యం, గుర్తింపును తెలంగాణ నుంచి వచ్చే హైకోర్జు జడ్జీలకు కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

టీ హైకోర్జు జడ్జీలకు ‘రాష్ట్ర అతిథులు’గా గుర్తింపు

అమరావతి, జనవరి 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని హైకోర్టు జడ్జీలకు ఇచ్చే ప్రాధాన్యం, గుర్తింపును తెలంగాణ నుంచి వచ్చే హైకోర్జు జడ్జీలకు కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌.సురే్‌షకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు రిజిస్ర్టార్‌ జనరల్‌ విన్నపం మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే హైకోర్టు జడ్జీలను ముఖ్య అతిథులుగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జడ్జీల అధికారిక లేదా అనధికారిక పర్యటనలోనూ ప్రోటోకాల్‌ పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Updated Date - Jan 02 , 2025 | 02:59 AM