Share News

Tirupati stampede: ‘తిరుపతి’ తొక్కిసలాట మృతుల కుటుంబీకులకు టీటీడీలో ఉద్యోగాలకు ప్రభుత్వ అనుమతి

ABN , Publish Date - Feb 12 , 2025 | 06:37 AM

వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా జనవరి 8వ తేదీన తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మృతి చెందడంతో పాటు పలువురు గాయపడిన విషయం తెలిసిందే.

Tirupati stampede: ‘తిరుపతి’ తొక్కిసలాట మృతుల కుటుంబీకులకు టీటీడీలో ఉద్యోగాలకు ప్రభుత్వ అనుమతి

తిరుమల, ఫిబ్రవరి11(ఆంధ్రజ్యోతి): తిరుపతి తొక్కిసలాటలో మృతుల కుటుంబీకులకు కాంట్రాక్టు ఉద్యోగం, పరిహారంపై టీటీడీ తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా జనవరి 8వ తేదీన తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మృతి చెందడంతో పాటు పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు వీరిలో అర్హత కలిగిన ఒకరికి కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఉద్యోగం, అలాగే పిల్లలకు విద్యా సహాయం అందించాలని.. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించాలని గత నెలలో జరిగిన టీటీడీ బోర్డులో తీర్మానం చేసి అనుమతి కోసం ప్రభుత్వానికి పంపారు. ఈ క్రమంలో టీటీడీ నిర్ణయాలను ఆమోదించడంతో పాటు వెంటనే అమలుచేయాలంటూ దేవదాయశాఖ కార్యదర్శి వినయ్‌చంద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.


Also Read: ఇకపై సహించను.. ఆ మంత్రులకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్..

Updated Date - Feb 12 , 2025 | 06:37 AM