Ashok Gajapathi Raju: రుషికొండను పిచ్చాసుపత్రిగా మారిస్తే మంచిది
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:07 AM
రుషికొండపై రూ.వందల కోట్ల ఖర్చుతో నిర్మించిన భవనం వల్ల ఆదాయమేమీ రాదు. దానిని పిచ్చాసుపత్రి చేస్తే మంచిది...
గోవా గవర్నర్ పూసపాటి అశోక్‌గజపతిరాజు
విశాఖపట్నం, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): ‘ రుషికొండపై రూ.వందల కోట్ల ఖర్చుతో నిర్మించిన భవనం వల్ల ఆదాయమేమీ రాదు. దానిని పిచ్చాసుపత్రి చేస్తే మంచిది’ అని గోవా గవర్నర్ పూసపాటి అశోక్‌గజపతిరాజు అన్నారు. సీతమ్మధార కల్యాణ మండపంలో బుధవారం క్షత్రియ సంక్షేమ సమితి సభ్యులు ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రుషికొండ ప్యాలె్‌సను ఏమి చేస్తే బాగుంటుంది? అని ప్రభుత్వం ప్రజాభిప్రాయం అడుగుతోంది కాబట్టి నేను ఉచిత సలహా ఇస్తున్నా. అక్కడ ఎవరిని బస చేయమన్నా నిద్ర కూడా పట్టదు. అందుకే పిచ్చి ఆస్పత్రిగా మార్చాలి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన సైకో ముఖ్యమంత్రికి తప్పకుండా సముద్రపు గాలి తగులుతుంది. గతంలో ఏడీబీ, ప్రపంచ బ్యాంకు రుణాలే ఉండేవి. ఇప్పుడు కొత్త తాకట్టులు వచ్చాయి. వాటి నుంచి ఈ ప్రభుత్వాలు ఎలా బయటపడతాయో తెలియట్లేదు. భారత్‌ను ఎవరూ వెనక్కి నెట్టలేరు. ప్రతి ఒక్కరూ అహాన్ని నియంత్రించుకోవాలి. అలాగని సన్యాసులుగా మారాలని చెప్పట్లేదు. భావి తరాలకు మంచి దేశాన్ని ఇవ్వాలనేదే నా అభిమతం’ అన్నారు.