Share News

Ashok Gajapathi Raju: రాష్ట్రపతి, ప్రధానితో గోవా గవర్నర్‌ భేటీ

ABN , Publish Date - Aug 05 , 2025 | 06:07 AM

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో గోవా గవర్నర్‌ అశోక్‌ గజపతి రాజు మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు

Ashok Gajapathi Raju: రాష్ట్రపతి, ప్రధానితో గోవా గవర్నర్‌ భేటీ

న్యూఢిల్లీ, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో గోవా గవర్నర్‌ అశోక్‌ గజపతి రాజు మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. సోమవారం ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో ముర్మును కలిసి కొంతసేపు ముచ్చటించారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లను గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజు కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న గోవా గవర్నర్‌ అశోక్‌ గజపతి రాజు సోమవారం పార్లమెంట్‌లోని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా అశోక్‌ గజపతి రాజుకు టీడీపీ ఎంపీలు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు.

Updated Date - Aug 05 , 2025 | 06:07 AM