Share News

వైభవంగా సుబ్రహ్మణ్యస్వామి రథోత్సవం

ABN , Publish Date - Jan 06 , 2025 | 12:17 AM

పట్టణంలోని ఎస్‌ఎల్‌వీ మార్కెట్‌ వీధిలో నాగులకట్ట వద్ద సుబ్రహ్మణ్యసామి షష్టి పూజ, రథోత్సవాన్ని ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

వైభవంగా సుబ్రహ్మణ్యస్వామి రథోత్సవం
రథోత్సవంలో పాల్గొన్న భక్తులు

ధర్మవరం, జనవరి 5(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఎస్‌ఎల్‌వీ మార్కెట్‌ వీధిలో నాగులకట్ట వద్ద సుబ్రహ్మణ్యసామి షష్టి పూజ, రథోత్సవాన్ని ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి పాలాభిషేకం నిర్వ హించారు. అనంతరం శ్రీవళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వర, నాగదేవతల రథోత్సవాన్ని వేలాది మంది భక్తుల నడుమ నిర్వహించారు. పాత బస్టాండ్‌ నుంచి తేరు వరకు భక్తులు రథాన్ని లాగా రు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీచేశారు. రథోత్సవంలో ధర్మవరం నియోజ కవర్గ టీడీపీ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మఽధుసూదనరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వనటౌన సీఐ నాగేంద్రప్రసాద్‌ బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Jan 06 , 2025 | 12:17 AM