GBS Disease: శ్రీకాకుళంలో జీబీఎస్ కలకలం!
ABN , Publish Date - Feb 13 , 2025 | 03:55 AM
ఇటీవల గ్రామంలో వాతాడ యువంత్ అనే పదేళ్ల బాలుడు ఈ వ్యాధితో మృతి చెందాడని ప్రచారం జరుగుతుండడంతో గ్రామస్థులు భయాందోళనలు చెందుతున్నారు. మహారాష్ట్రలో ఈ వ్యాధితో చాలామంది మృతి చెందగా, ఇటీవల తెలంగాణలో కూడా వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి.

బాలుడి మృతిపై అనుమానం
గ్రామాన్ని సందర్శించిన డీఎంహెచ్‌వో
నిర్ధారణకు రావాల్సి ఉందని వెల్లడి
విద్యార్థులు, గ్రామస్థులకు వైద్య పరీక్షలు
సంతబొమ్మాళి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కాపుగోదాయవలసలో గులియన్ బారీ సిండ్రోమ్ (జీబీఎస్) వ్యాధి కలకలం రేగింది. ఇటీవల గ్రామంలో వాతాడ యువంత్ అనే పదేళ్ల బాలుడు ఈ వ్యాధితో మృతి చెందాడని ప్రచారం జరుగుతుండడంతో గ్రామస్థులు భయాందోళనలు చెందుతున్నారు. మహారాష్ట్రలో ఈ వ్యాధితో చాలామంది మృతి చెందగా, ఇటీవల తెలంగాణలో కూడా వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో కాపుగోదాయవలసలో ఈ వ్యాధి సోకి బాలుడు మృతి చెందాడన్న అనుమానంతో జిల్లా వైద్యాధికారి బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది బుధవారం గ్రామాన్ని సందర్శించింది. బాలుడి తల్లి రోజా నుంచి వివరాలు అడిగి తెలునుకున్నారు. జనవరి 29వ తేదీన యువంత్‌కు పుట్టినరోజు వేడుక నిర్వహించామని, ఆ మరుసటి రోజు నీరసంగా ఉందంటూ లేవలేకపోవడంతో ప్రైవేటు వైద్యుడికి చూపించామని బాలుడి తల్లి తెలిపారు. డాక్టర్ సలహా మేరకు శ్రీకాకుళంలోని పలు ఆసుపత్రుల్లో చూపించిన తర్వాత విశాఖకు తరలించామన్నారు. అక్కడ వైద్యులు పరిశీలించి గులియన్ బారీ సిండ్రోమ్ అని చెప్పారని తెలిపారు. అక్కడి నుంచి రాగోలు జెమ్స్ ఆసుపత్రికి తరలించామని, అక్కడ బ్రెయిన్‌డెడ్‌తో మృతి చెందాడని చెప్పారు. బాలుడి నేత్రాలు, ఇతర అవయవాలను దానం చేశామని రోజా తెలిపారు. అంతకుముందు ఏవైనా వ్యాధి లక్షణాలు కనిపించాయా? అని వైద్యులు అడిగి తెలుసుకున్నారు బాలుడికి నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికలను పరిశీలించారు. అనంతరం వైద్య బృందం గ్రామంలో ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. గ్రామంలో జ్వరంతో బాఽధపడుతున్న, గొంతునొప్పి లక్షణాలు ఉన్న వారి వివరాలు సేకరించారు. పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
నిర్ధారణ కావాల్సి ఉంది
‘బాలుడు యువంత్ జీబీఎ్‌సతో మృతి చెందాడన్న దానిపై పూర్తి స్థాయిలో నిర్ధారణకు రావాల్సి ఉంది. నివేదికల్లో ఒక దాంట్లో మాత్రమే ఈ వ్యాధి సోకినట్లు ఉంది. ఇటువంటి వ్యాధి మూడు లక్షల మందిలో ఒకరికి సోకుతుంది. గ్రామంలో పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం’ అని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి బాలమురళీకృష్ణ తెలిపారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..
Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం
Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి
Also Read: మరోసారి కుల గణన సర్వే
Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు
Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం
For AndhraPradesh News And Telugu News