Share News

D.S.C. Coaching: ఆన్‌లైన్‌లో ఉచిత డీఎస్సీ కోచింగ్‌

ABN , Publish Date - Apr 25 , 2025 | 04:36 AM

బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్‌.సవిత చేసిన ప్రకటన ప్రకారం, 'ఆచార్య' యాప్‌ ద్వారా బీసీ, ఈడబ్ల్యూఎస్‌, కాపు, ఎస్సీ, ఎస్టీ డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత ఆన్‌లైన్‌ కోచింగ్‌ అందించబడుతోంది. ఈ సేవలు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు.

D.S.C. Coaching: ఆన్‌లైన్‌లో ఉచిత డీఎస్సీ కోచింగ్‌

ఇందుకు ‘ఆచార్య’ యాప్‌ రూపకల్పన

ప్రారంభించిన బీసీ సంక్షేమ మంత్రి సవిత

24 గంటలూ ఓపెన్‌ చేసుకోవచ్చు యాప్‌లో మెటీరియల్‌, నిష్ణాతుల బోధనలు, పాత డీఎస్సీ ప్రశ్నపత్రాలు

అమరావతి, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): బీసీ స్టడీ సర్కిల్‌ ద్వారా బీసీ, ఈడబ్ల్యూఎస్‌, కాపు, ఎస్సీ, ఎస్టీ డీఎస్సీ అభ్యర్థులందరికీ ఆన్‌లైన్‌ ద్వారా ఉచిత కోచింగ్‌ అందించనున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్‌.సవిత తెలిపారు. ఇందుకోసం శ్యామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా ‘ఆచార్య’ యాప్‌ను రూపొందించామని, దీని ద్వారా 24 గంటలపాటు ఉచిత కోచింగ్‌ ఉంటుందని వెల్లడించారు. గురువారం అమరావతి సచివాలయంలోని తన చాంబర్‌లో మంత్రి సవిత ఆన్‌లైన్‌ ఉచిత డీఎస్సీ కోచింగ్‌ను ప్రారంభించారు. డీఎస్సీ ద్వారా అత్యధిక ఉపాధ్యాయ పోస్టులను బీసీ అభ్యర్థులే సాధించాలన్న లక్ష్యంతో బీసీ సంక్షేమశాఖ ద్వారా ఉచిత కోచింగ్‌ సెంటర్లు ప్రారంభించామన్నారు. 26 జిల్లాల్లోనూ బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్‌ సెంటర్లు నిర్వహించామన్నారు. బీసీ, ఈడబ్ల్యూఎస్‌, కాపు, ఎస్సీ, ఎస్టీ డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించామని, శిక్షణా కాలంలో నెలకు రూ.1,500 స్టైఫండ్‌ మరో రూ.వెయ్యి పుస్తకాల కొనుగోలుకు అందజేశామని తెలిపారు. తాజాగా ఆఫ్‌లైన్‌గా కోచింగ్‌ పొందలేని గృహిణులు, సుదూర ప్రాంతవాసులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో చిన్న ఉద్యోగాలు చేసేవారు, ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారి కోసం ఆన్‌లైన్‌ కోచింగ్‌ ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ ఉచిత కోచింగ్‌ అందిస్తామని, ప్రస్తుతం 3,189 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు.


చాట్‌ బాక్స్‌ ద్వారా ప్రశ్నలు అడగొచ్చు

కాకినాడకు చెందిన శ్యామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా ఈ ఉచిత కోచింగ్‌ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం శ్యామ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆచార్య పేరుతో యాప్‌ రూపొందించారని పేర్కొన్నారు. ఇది 24 గంటలు పనిచేస్తుందని, అభ్యర్థులు రోజులో ఎన్నిసార్లు అయినా ఓపెన్‌ చేసేలా రూపొందించామన్నారు. ఇందులో నిష్ణాతులైన అధ్యాపకుల బోధనలు, అన్ని సబ్జెక్టులకు చెందిన మెటీరియల్‌, పాత డీఎస్సీ ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. యాప్‌లో చాట్‌ బాక్స్‌ రూపొందించామని, అందులో సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు అడిగితే.. సిబ్బంది తక్షణమే స్పందించి సమాధానాలు తెలుపుతారన్నారు. ఆఫ్‌లైన్‌లో డీఎస్సీ శిక్షణ పొందిన డీఎస్సీ అభ్యర్థులు కూడా ఆన్‌లైన్‌ శిక్షణకు అర్హులేనని మంత్రి తెలిపారు.


కాపు అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌

డీఎస్సీ అభ్యర్థులకు ఉచితంగా ఆన్‌లైన్‌ కోచింగ్‌ ఇవ్వనున్నట్లు కాపు కార్పొరేషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజికవర్గాల అభ్యర్థులు శుక్రవారం నుంచి ఈనెల 28 వరకు జ్ట్టిఞట://ఝఛీజఛి.్చఞఛిజటట.జీుఽ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 25 , 2025 | 04:36 AM