Vinukonda: పొట్టకూటి కోసం వెళుతూ మృత్యువాత
ABN , Publish Date - May 14 , 2025 | 06:21 AM
పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై మంత్రి లోకేశ్ స్పందించి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
నలుగురు మృతి.. ముగ్గురికి తీవ్రగాయాలు
పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం
ఎదురెదురుగా వేగంగా ఢీకొన్న ట్రాలీ బొలెరో, లారీ
వినుకొండటౌన్, మే 13 (ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం గ్రామ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వెల్లలచెరువు సమీపంలోని అడ్డరోడ్డుకు బొప్పాయి కాయల కోత పనికి యర్రగొండపాలెం సమీపంలోని గడ్డమీదపల్లెకు చెందిన పగడాల రమణారెడ్డి(45), ఆయన భార్య సుబ్బమ్మ(40), జొన్నగిరి రామాంజి (36), ఆయన భార్య అంకమ్మ(28), కన్నెబోయిన నాగమణి, పగడాల శివమ్మ, కదిరి నాగేశ్వరరావు(డ్రైవర్) ట్రాలీ బొలెరోలో వస్తున్నారు. అదే సమయంలో వినుకొండ నుంచి మార్కాపురానికి కొబ్బరికాయలతో వెళ్తున్న లారీ, కూలీలు ప్రయాణిస్తున్న బొలెరో ఎదురెదురుగా వేగంగా ఢీకొన్నాయి. ప్రమాదంలో సుబ్బమ్మ, అంకమ్మ అక్కడికక్కడే మృతి చెందగా రమణారెడ్డి, రామాంజి వినుకొండ వైద్యశాలకు తరలిస్తుండగా మృతిచెందారు. తీవ్ర గాయాలైన నాగమణి, శివమ్మ, నాగేశ్వరరావును ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.
మెరుగైన వైద్యం అందించాలి: లోకేశ్
శివాపురం వద్ద ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటనపై మంత్రి లోకేశ్ స్పందించి అధికారులను అప్రమత్తం చేసి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబీకులను పల్నాడు జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫోన్‌లో పరామర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్
CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..