Share News

నాలుగు చలివేంద్రాలు ప్రారంభం

ABN , Publish Date - Mar 08 , 2025 | 11:26 PM

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, స్టేట్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌లో శ్రీ సద్గురు దత్త కృపాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నాలుగు చలివేంద్రాలను శనివారం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.కే.వెంకటేశ్వర్లు ప్రారంభించారు.

 నాలుగు చలివేంద్రాలు ప్రారంభం
చలివేంద్రాలను ప్రారంభిస్తున్న సూపరింటెండెంట్‌

కర్నూలు హాస్పిటల్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, స్టేట్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌లో శ్రీ సద్గురు దత్త కృపాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నాలుగు చలివేంద్రాలను శనివారం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.కే.వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ శ్రీసద్గురు దత్త కృపాలయం గత 23 సంవత్సరాల నుంచి రోగులకు ఎన్నో సపేవలందిస్తుందని, అందులో భాగంగా ప్రతిరోజు వేయి మంది రోగుల సహాయకులకు మధ్యాహ్నం భోజనం అందిస్తుందన్నారు. అలాగే ఆసుపత్రికి కావాల్సిన పరికరాలను కూడా అందించిందని, ఎండాకాలంలో రోగులు, వారి సహాయకుల కోసం దాహార్తీని తీర్చేందుకు ఈ ఏడాది కూడా నాలుగు చలివేంద్రాలను ప్రారంభించడం అభినందనీయమన్నారు. కర్నూలు జీజీహెచలో ట్రామకేర్‌, గైనిక్‌, సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌, స్టేట్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌లో చలివేంద్రాలను ఏర్పాటు చేశామని, రోగులు, వారి సహాయకులు వీటని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో హాస్పిటల్‌ అడ్మినిస్ర్టేటర్‌ డా.శివబాల నాగాంజన, శ్రీసద్గురు దత్త కృపాలయం వ్యవస్థాపకులు చంద్రశేఖర్‌ రెడ్డి ప్రెసిడెంటు మల్లారెడ్డి పాల్గొన్నారు.

.

Updated Date - Mar 08 , 2025 | 11:26 PM