Mantena : మంతెన సత్యనారాయణ రాజుకి జాక్ పాట్
ABN , Publish Date - Aug 18 , 2025 | 06:13 PM
టీడీపీ మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు సీఎం కార్యక్రమాల సమన్వయకర్తగా నియమితులయ్యారు. దీంతో, ఆయనకు సహాయమంత్రి హోదా కల్పిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. జీఏడీ, ప్రోటోకాల్ డైరెక్టర్‌లకు..
అమరావతి, ఆగస్టు 18 : టీడీపీ మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజుని మళ్లీ అదృష్టం వరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమాల సమన్వయకర్తగా మంతెన నియామకమయ్యారు. దీంతో, మంతెన సత్యనారాయణ రాజు కు సహాయమంత్రి హోదా కల్పిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. తదుపరి చర్యలు తీసుకోవాలని జీఏడీ, ప్రోటోకాల్ డైరెక్టర్ లకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జీవో జారీ చేశారు.