Share News

Budda Venkanna : జగన్‌ను మానసిక వైద్యులకు చూపించండి

ABN , Publish Date - Feb 07 , 2025 | 05:22 AM

మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి మానసిక వైద్యుల వద్ద పరీక్షలు చేయించాలని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సూచించారు. తన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్‌ పాలనను అంగీకరించకనే ప్రజలు ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేసి, ప్రతిపక్ష హోదా కూడా

Budda Venkanna : జగన్‌ను మానసిక వైద్యులకు చూపించండి

విజయవాడ(వన్‌టౌన్‌), ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి మానసిక వైద్యుల వద్ద పరీక్షలు చేయించాలని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సూచించారు. తన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్‌ పాలనను అంగీకరించకనే ప్రజలు ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేసి, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మూలన కూర్చోబెట్టారన్నారు. ప్రజలు కూటమి ప్రభుతాన్ని ఎన్నుకుని సంతోషంగా ఉన్నారన్నారు. ఏడాది కూడా కాకుండానే తనకే ప్రజలు అధికారం కట్టబెడతారని, మరో 30 సంవత్సరాలు సీఎంగా ఉంటాననే భ్రమలుపోతున్నాడని ఎద్దేవా చేశారు. జగన్‌ మాటలకు వైసీపీలోని నాయకులే విస్తుపోతున్నారన్నారు. జగన్‌ హయాంలో రాష్ట్రంలో ఎక్కడ పట్టినా కబ్జాలేనన్నారు. దమ్ముంటే జగన్‌ అసెంబ్లీకి వెళ్లి ప్రజల పక్షాన మాట్లాడాలన్నారు. జగన్‌ 2.0కు 2029 ఎన్నికల్లో ఇప్పుడు వచ్చిన 11 సీట్లు కూడా రావని బుద్దా తేల్చిచెప్పారు.

Updated Date - Feb 07 , 2025 | 05:22 AM