Share News

Alla Nani Joins TDP : టీడీపీలోకి ఆళ్లనాని

ABN , Publish Date - Feb 14 , 2025 | 06:15 AM

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గురువారం టీడీపీలో చేరారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఆళ్ల నానికి టీడీపీ కండువా కప్పిన సీఎం చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కె.పార్థసారథి, టీడీపీ రాష్ట్ర

Alla Nani Joins TDP : టీడీపీలోకి ఆళ్లనాని

కండువాకప్పి ఆహ్వానించిన చంద్రబాబు

అమరావతి, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గురువారం టీడీపీలో చేరారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఆళ్ల నానికి టీడీపీ కండువా కప్పిన సీఎం చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కె.పార్థసారథి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, సీనియర్‌ టీడీపీ నేత సుజయ్‌ కృష్ణ రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఆళ్ల నాని మూడుసార్లు ఎమ్మెల్యేగా చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా చేశారు. ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన మూడు నెలల క్రితమే వైసీపీకి రాజీనామా చేశారు.

Updated Date - Feb 14 , 2025 | 06:15 AM