రోడ్డు భద్రతా నియమాలు పాటించండి : డీఎస్పీ
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:10 AM
రోడ్డు భద్రతా నియమా లను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని, ఉల్లంగిస్తే చర్యలు తప్పవని డీఎస్పీ విజయ్‌కుమార్ హెచ్చరించారు.

పుట్టపర్తిరూరల్, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): రోడ్డు భద్రతా నియమా లను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని, ఉల్లంగిస్తే చర్యలు తప్పవని డీఎస్పీ విజయ్‌కుమార్ హెచ్చరించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని సాయిఆరామంలో రోడ్డుభద్రతా మాసోత్సవాలలో భాగంగా అటోడ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీసు నిబంధనలు తప్పకపాటించాలన్నారు. అంతకు మునుపు సాయిఆరామం నుంచి గణేష్ కూడలి వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నల్లమాడ సీఐ నరేంద్రరెడ్డి, కొత్తచెరువు సీఐ ఇందిర, పుట్టపర్తి రూరల్ సీఐ సురే్‌షకుమార్, ఎస్‌ఐ లింగన్న పాల్గొన్నారు.