Share News

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

ABN , Publish Date - Jan 17 , 2025 | 11:38 PM

వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ఆళ్లగడ్డ డీఎస్పీ రవికుమార్‌ తెలిపారు.

  రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
టోల్‌ ప్లాజా వద్ద మాట్లాడుతున్న డీఎస్పీ రవికుమార్‌

చాగలమర్రి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ఆళ్లగడ్డ డీఎస్పీ రవికుమార్‌ తెలిపారు. శుక్రవారం చాగలమర్రి టోల్‌ ప్లాజా వద్ద 36వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ప్రాజెక్టు హెడ్‌ మదనమోహన, సీనియర్‌ మేనేజర్‌ అరుణ్‌రాజ్‌, సేఫ్టి మేనేజర్‌ ఖా దర్‌వలి ఆధ్వర్యంలో కర్నూలు అమీలియా వైద్యశాల ఏర్పాటు చేసి న వైద్యశిబిరాన్ని డీఎస్పీ ప్రారంభించారు. వైద్యులు ప్రసన్న, ర మాదేవి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కా ర్యక్రమం లో ఆళ్లగడ్డ రూరల్‌ ఎస్‌ఐ హరిప్రసాద్‌, టోల్‌ప్లాజా ఆర్‌వోఎం నరేష్‌ రెడ్డి, మేనేజర్‌ ప్రదిప్‌ మాలిక్‌, రూట్‌ మేనేజర్‌ కుతుబుద్దిన, పారా మెడికల్‌ అబ్దుల్‌ కలామ్‌, వైద్య, టోల్‌ ప్లాజా సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2025 | 11:38 PM