Exam Tips: కష్టపడి కాదు ఇష్టపడి చదవండి
ABN , Publish Date - Jan 25 , 2025 | 04:47 AM
పరీక్షలకు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే ర్యాంకులు వాటంతట అవే వస్తాయన్నారు. పరీక్షల సమయంలో ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం ఎంతో శ్రేయస్కరమని వివరించారు. పదో తరగతి విద్యార్థుల కోసం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రవీంద్ర విద్యాసంస్థల ప్రాంగణంలో కోనసీమ సైన్స్ పరిషత్ 2897 మహాసభ విద్యాసంస్థల అధినేత గిడుగు నాగేశ్వరరావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు.

విద్యార్థులకు సర్వేశ్వరశర్మ సూచన
అమలాపురం టౌన్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పబ్లిక్ పరీక్షలపై భయాన్ని పూర్తిగా వీడాలని కోనసీమ సైన్స్‌పరిషత్ అధ్యక్షుడు, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సీవీ సర్వేశ్వరశర్మ విద్యార్థులకు సూచించారు. పరీక్షలకు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే ర్యాంకులు వాటంతట అవే వస్తాయన్నారు. పరీక్షల సమయంలో ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం ఎంతో శ్రేయస్కరమని వివరించారు. పదో తరగతి విద్యార్థుల కోసం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రవీంద్ర విద్యాసంస్థల ప్రాంగణంలో కోనసీమ సైన్స్ పరిషత్ 2897 మహాసభ విద్యాసంస్థల అధినేత గిడుగు నాగేశ్వరరావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ముఖ్య వక్తగా హాజరైన సర్వేశ్వరశర్మ మాట్లాడుతూ పరీక్షల పట్ల విద్యార్థులు సానుకూల దృక్పథాన్ని అలవరుచుకోవాలన్నారు. మార్కులు పరీక్షాధికారి దయతో ప్రసాదించేవి కాదని కఠోర శ్రమచేసి ఏకాగ్రతతో చదివి సాధించుకునేవని విద్యార్థులకు గుర్తు చేశారు. పబ్లిక్ పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున సబ్జెక్టులలో సందేహాలుంటే ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. సమావేశంలో అకడమిక్ డైరెక్టర్ ఎ.భార్గవి, విశ్రాంత తెలుగు పండితుడు మండలీక ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
AP News: ఈ బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత కల్పించండి: సీఎంచంద్రబాబు..
Visakha: కోడికత్తి కేసులో ఎన్ఐఏ కోర్టుకు శ్రీను.. మరి జగన్ వెళ్లారా..
Supreme Court: వైసీపీ నేత గౌతంరెడ్డికి సుప్రీంలో ఊరట