ఫినిష్ ఆంధ్రా!
ABN , Publish Date - Jan 18 , 2025 | 12:15 AM
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను వ్యాపారవేత్తలను చేస్తామంటూ వైసీపీ ప్రభుత్వం ఫిష్ ఆంధ్రా పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది.

ఘోరంగా విఫలమైన పథకం
అప్పట్లో వైసీపీ ప్రభుత్వం గొప్పలు
సబ్సిడీ సొమ్మును జేబులో
వేసుకున్న వైసీపీ నేతలు
అప్పుల పాలైన నిర్వాహకులు
ఏలూరు టూటౌన్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను వ్యాపారవేత్తలను చేస్తామంటూ వైసీపీ ప్రభుత్వం ఫిష్ ఆంధ్రా పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. ఎంత ఆర్భాటంగా ప్రారంభించారో అంతే త్వరగా ఈ పథకం ఘోరంగా విఫలమైంది. ఫిష్ ఆంధ్రా పథకంలో యూనిట్‌లన్ని వైసీపీ నేతలకే మత్స్యశాఖాధికారులు కట్టబెట్టారు. ఫిష్ ఆంధ్రా స్టాల్స్ స్థాపించినట్లే స్థాపించి ప్రభుత్వ అధికారులు తనిఖీలు చేసిన తర్వాత మూసివేసి సబ్సిడీ సొమ్ము వారి ఖాతా ల్లో వేసుకున్నారు. జిల్లాలో ఫిష్ ఆంధ్రా పథకం ద్వారా వైసీపీ నాయకులు 4కోట్ల 34లక్షల సబ్సిడీ నొక్కేశారు. ప్రభుత్వం ఈ పథకంలో 40 – 60 శాతం వరకు సబ్సిడీ ఇచ్చింది. 85 లక్షలతో జిల్లాలో ఒక ఆక్వాహబ్, రూ.75 వేల విలువ కలిగిన ఐస్‌బాక్సులతో మోటర్ సైకిళ్లు 16, రూ.3 లక్షల విలువైన చేపల అమ్మకపు ఆటోలు 6, రూ.20 లక్షల విలువైన చేపల రవాణా ఇన్సులేటెడ్ వాహనాలు 14, రూ.2లక్షల విలువతో ఏర్పాటు చేసిన చేపల దుకాణాలు 141, రూ.10 లక్షల విలువతో ఏర్పాటు చేసిన చేపల దుకాణాలు 12, రూ.20 లక్షల విలువతో ఏర్పాటు చేసిన లైవ్‌ఫిష్ దుకాణాలు రెండు, రూ.50 లక్షల విలువతో లాంజ్ రెస్టారెంట్లు 2, రూ.45 లక్షల విలువ కలిగిన సీడ్ స్టాకింగ్ పాయింట్లు 45 ప్రభుత్వం మంజూరు చేసింది. పైన పేర్కొవన్నీ జిల్లాలో ఎక్కడా కనిపించవు. కేవలం వైసీపీ నాయకులు సబ్సిడీ సొమ్ము జేబులో వేసుకునేందుకే ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. మత్స్య ఉత్పత్తుల వినియోగాన్ని పెంచడానికి ప్రజలకు పోషక విలువల తో కూడిన ఆహారాన్ని అందించే ఉద్దేశంతో ఆక్వాహబ్ లు, రిటైల్ అవుట్‌లెట్ లను ఫిష్‌ఆంధ్రా పేరుతో ప్రారంభించారు. తాజా చేపలు, రొయ్యలు, పీతలు, ఎండుచేపలు, ఎండు రొయ్యలు, వండుకునేందుకు సిద్ధం చేసిన ఆక్వా ఉత్పత్తులు, పచ్చళ్లు, మొదలైనవి ఒకే చోట దొరికే విధంగా ఫిష్ ఆంధ్రా రిటైల్ అవుట్ లెట్‌లను ఏర్పాటు చేశారు. పట్టణ, గ్రామాల్లో కూడా అన్ని వేళల్లో ప్రజ లకు అందుబాటులో సరసమైన ధరలకు దొరికేలా ప్లాన్ చేశారు. జిల్లాలో రూ.80 లక్ష లతో ఒక ఆక్వా హబ్‌ను ఏర్పాటు చేశారు. దీనికింద లాంజ్ మోడల్ షాప్ ఒకటి, ఐదు సూపర్ స్టోర్‌లు, 8 డైలీస్టోర్, రెండు మొబైల్ యూనిట్‌లు, పది ఈకార్టులు, గ్రామ, వార్డు స్థాయిలో మినీ అవుట్ లెట్‌స్టోర్స్ అను సంధానించ బడతాయి. ఈ ఆక్వాహాబ్‌లు మినీ రిటైల్ అవుట్‌లెట్ షాపులకు సరుకులు అందజేసేలా ఏర్పాటు చేశారు. ఆక్వాహబ్‌ను కలిదిండిలో ఏర్పాటు చేశారు. ఈ హబ్ నుంచి ఎవరికి ఆక్వా ఉత్పత్తులను సరఫరా చేయడం లేదని తెలుస్తోంది. దీంతో మినీఫిష్ అవుట్ లెట్‌లు మూత పడ్డాయి. మినీఫిష్ అవుట్‌లెట్‌లు ఏర్పా టు చేసిన లబ్ధిదారులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయకుండా రూ.2లక్షల విలువైన సామగ్రి ఇచ్చింది. లైవ్‌ఫిష్ ట్యాంకు, ఫర్నీచర్, ఫ్రీజ్‌లు, వేయింగ్ మిషన్లు, బేషిన్లు, కటింగ్ టేబుళ్లు అందించారు. షాపునకు పెయింటింగ్ బోర్డులకు వైసీపీ రంగులు వేశారు. వాటికి అయ్యేఖర్చును లబ్ధిదా రుల నుంచి వసూలు చేశారు. ఆక్వాహబ్ నిర్వా హకు లు చిన్నషాపులకు సరుకు సరఫరా చేయక పోవడంతో బయట మార్కెట్ నుంచి తెచ్చుకుని అమ్మడం వల్ల నష్టాలు వస్తున్నాయి. దీంతో దాదాపు 80 శాతం షాపులు మూసివేశారు.
ఎంతో నష్టపోయాను..
రూ.రెండు లక్షలతో ఫిష్ అవుట్‌లెట్ ప్రారంభిం చాను. రూ.2 లక్షల విలువతో వైసీపీ ప్రభుత్వం కేవలం సామగ్రి అందజేసింది. ఒక్క రూపాయి ఇవ్వ లేదు. ప్రభుత్వం ఇచ్చిన సామగ్రిలో చాలావరకు నిరుపయోగంగా ఉన్నాయి. షాపులకు వైసీపీ రంగులు వేసి మాదగ్గరే డబ్బులు వసూలు చేశారు. ఫిష్ ఆంధ్రా అని బోర్డులు పెట్టి ఆ బోర్డు వ్యయం మా పైనే వేశారు. ఈ పరికరాలన్నిటిని ప్రభుత్వం ఏజన్సీ ద్వారా సప్లై చేసింది. ఆ ఏజన్సీకి బ్యాంకులు డబ్బులు ముట్టజెప్పాయి. బ్యాంకుకు ఈఎంఐలు మేము కట్టాల్సి వస్తోంది. ప్రస్తుతం షాపు నష్టాల్లో నడుస్తోంది.
– రవికాంత్, స్టాల్ నిర్వాహకుడు