Share News

Tadepalli : ఆకతాయిల పనా..? లేక అస్మదీయుల పనా..!

ABN , Publish Date - Feb 07 , 2025 | 05:26 AM

తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌ ఇంటి ఎదుట బుధవారం రాత్రి మంటలు వ్యాపించాయి. ఇంకేముంది భద్రతా లోపంతోనే ఈ ఘటన జరిగింది.. అంటూ సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌

Tadepalli : ఆకతాయిల పనా..? లేక అస్మదీయుల పనా..!

మాజీ సీఎం జగన్‌ ఇంటి వద్ద తగలబడిన ఎండిన గ్రీనరీ

తాడేపల్లి టౌన్‌, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌ ఇంటి ఎదుట బుధవారం రాత్రి మంటలు వ్యాపించాయి. ఇంకేముంది భద్రతా లోపంతోనే ఈ ఘటన జరిగింది.. అంటూ సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేశాయి. జగన్‌ ఇంటి ఎదుట ఉన్న కాల్వ గట్టుపై సుమారు కిలోమీటరు మేర గ్రీనరీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నిర్వహణ లేకపోవడంతో అక్కడక్కడా ఎండి పోయి నిర్జీవంగా మారింది. ఆంధ్రరత్న పంపింగ్‌ స్కీమ్‌ వైపు నుంచి భరతమాత విగ్రహం వరకు ఐదు చోట్ల బుధవారం రాత్రి ఆ ఎండిన గ్రీనరీకి మంటలు అంటుకుని తగలబడింది. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సెల్‌ టవర్‌ వద్ద కొన్ని వైర్లు తగలబడ్డాయి. కాగా ఈ రోడ్‌ పూర్తిగా సీసీ కెమేరాల పర్యవేక్షణలో ఉంది. భద్రతా అధికారులు విచారణ చేస్తే మంటలు ఎలా వ్యాపించాయి? ఇది ఆకతాయిల పనా? లేక అస్మదీయుల పనా! అనేది తేలిపోతుంది.

Updated Date - Feb 07 , 2025 | 05:26 AM