Share News

కన్నుల పండువగా ఉత్సవం

ABN , Publish Date - Feb 13 , 2025 | 11:47 PM

డోన పట్టణ సమీపంలో నూతనంగా నిర్మించిన షిరిడీ సాయిబాబా మందిరంలో గురువారం షిరిడీ సాయిబాబా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. తెల్లవారు జాము నుంచి షిరిడీ సాయి మందిరంలో విశేష పూజ కార్యక్రమాలు జరిగాయి.

   కన్నుల పండువగా ఉత్సవం
(షిరిడీ సాయిబాబా విగ్రహ ప్రతిష్ట వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన రెడ్డి

షిరిడీ సాయిబాబా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ

ఫ భారీగా తరలివచ్చిన భక్తులు

డోన రూరల్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): డోన పట్టణ సమీపంలో నూతనంగా నిర్మించిన షిరిడీ సాయిబాబా మందిరంలో గురువారం షిరిడీ సాయిబాబా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. తెల్లవారు జాము నుంచి షిరిడీ సాయి మందిరంలో విశేష పూజ కార్యక్రమాలు జరిగాయి. షిరిడీ సాయిబా బాబా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి ఆయన సతీమణి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ దంపతులు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే టీడీపీ సీనియర్‌ నాయకుడు కేఈ ప్రతాప్‌, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ వేడుకల్లో పాల్గొని పూజలు చేశారు. అంతకుముందు షిరిడీ సాయిబాబా మందిరం కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన రెడ్డి, కోట్ల దంపతులకు, టీడీపీ సీనియర్‌ నాయకుడు కేఈ ప్రతాప్‌, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబులకు కమిటీ సభ్యులు సోదారహంగా ఘన స్వాగతం పలికారు. షిరిడీ సాయిబాబా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. బాబాను దర్శించుకున్న భక్తులకు షిరిడీ సాయిబాబా మందిరం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర సీడ్స్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన చైర్మన ధర్మవరం సుబ్బారెడ్డి, షిరిడీ సాయిబాబా మందిరం కమిటీ సభ్యులు చాటకొండ శ్రీనివాసులు కొండా సురేష్‌, పార్థసారథి, ఆలా మల్లికార్జున రెడ్డి, శ్రీరాములు భక్తులు పాల్గొన్నారు.

ఫ బందోబస్తు నిర్వహించిన పోలీసులు:

షిరిడీ సాయిబాబా ప్రాణప్రతిష్ఠ విగ్రహ కార్యక్రమానికి వచ్చిన భక్తులను దృష్టిలో ఉంచుకుని డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పట్టణ సీఐ ఇంతియాజ్‌ బాషా, రూరల్‌ సీఐ సీఎం రాకేష్‌ పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. షిరిడీ సాయిబాబా మందిరం ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

Updated Date - Feb 13 , 2025 | 11:47 PM