Father love son grave: బిడ్డపై తండ్రి మమకారం.. సమాధి వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు..
ABN , Publish Date - Dec 21 , 2025 | 07:40 PM
కొడుకు మృతిని తట్టుకోలేని తండ్రి మమకారం.. చుట్టూ ఉన్నవారిని కంటతడి పెట్టిస్తోంది. బిడ్డ మృతదేహానికి కుటుంబ సభ్యులు శ్మశానంలో అంత్యక్రియలను పూర్తి చేశారు.
చంద్రగిరి మండలంలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం కందులవారిపల్లెలో అనారోగ్యంతో వారం రోజుల కిందట ఓ బాలుడు (6) మృతి చెందాడు. కొడుకు మృతిని తట్టుకోలేని తండ్రి మమకారం.. చుట్టూ ఉన్నవారిని కంటతడి పెట్టిస్తోంది. బిడ్డ మృతదేహానికి కుటుంబ సభ్యులు శ్మశానంలో అంత్యక్రియలను పూర్తి చేశారు (CCTV at child grave).
తమకు తొలిబిడ్డ అయిన కొడుకు మృతదేహాన్ని మంత్రగాళ్లు ఎక్కడ తీసుకెళ్లిపోతారోనని, ఆ తండ్రి స్మశానంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పూడ్చి పెట్టిన బిడ్డ శవాన్ని మంత్రగాళ్లు ఎత్తుకెళతారని భావిస్తున్న తండ్రి.. సమాధి వద్ద సీసీ కెమెరాలు పెట్టించాడు. అంతకు ముందు కొద్ది రోజుల పాటు రోజుకు 1000 రూపాయలు చొప్పున డబ్బులు ఇచ్చి నిఘా కూడా పెట్టించారు (Chandragiri emotional story).
చివరకు సమాధి వద్ద సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన తండ్రి నిత్యం సెల్ ఫోన్ ద్వారా పర్యవేక్షిస్తున్నాడు (father installs CCTV grave). బిడ్డపై తండ్రి మమకారం గ్రామస్తులకు కంట తడి తెప్పిస్తోంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఇవీ చదవండి:
ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పరిమితంగా ట్రంప్ ప్రస్తావన.. విమర్శల వెల్లువ
కెనడా జనాభాలో తగ్గుదల.. 1946 తరువాత తొలిసారిగా..