Share News

రైతులకు తప్పని నిరీక్షణ

ABN , Publish Date - Sep 02 , 2025 | 10:48 PM

ఖరీ ఫ్‌ సీజన్‌, వర్షాలు కురుస్తుండడంతో, వరి, వేరుశనగ, ఇతర పంటలకు అదును కావడంతో రైతు లు వరి నాట్లు వేశారు. కొన్ని ప్రాంతాల్లో వరి సాగు చేసి నెల రోజులు, మరికొన్ని చోట్ల 20 రో జులు దాటుతున్నా ఇప్పటికీ రైతులు యూరియా వేయలేదు. నాట్లు వేసిన 15 రోజులకే యూరి యా చల్లాల్సి ఉండగా అవసరం మేరకు యూరి యా దొరకడంలేదు. దీంతో యూరియా కోసం రైతులు నానా తంటాలు పడుతున్నారు.

రైతులకు తప్పని నిరీక్షణ
పీలేరులో యూరియా కోసం మండుటెండలో క్యూలైన్‌లో రైతులు

మండుటెండలో యూరియా కోసం క్యూ

నెల రోజులుగా పడిగాపులు

బస్తాపై రూ.30 అదనం

పీలేరురూరల్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఖరీ ఫ్‌ సీజన్‌, వర్షాలు కురుస్తుండడంతో, వరి, వేరుశనగ, ఇతర పంటలకు అదును కావడంతో రైతు లు వరి నాట్లు వేశారు. కొన్ని ప్రాంతాల్లో వరి సాగు చేసి నెల రోజులు, మరికొన్ని చోట్ల 20 రో జులు దాటుతున్నా ఇప్పటికీ రైతులు యూరియా వేయలేదు. నాట్లు వేసిన 15 రోజులకే యూరి యా చల్లాల్సి ఉండగా అవసరం మేరకు యూరి యా దొరకడంలేదు. దీంతో యూరియా కోసం రైతులు నానా తంటాలు పడుతున్నారు. రైతు సేవా కేంద్రాలకు వచ్చే యూరియా గంటల వ్యవధిలోనే అయిపోతుంటే రైతులకు కడగండ్లు తప్పడంలేదు. అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్నారే తప్ప అధికారులు రైతుల అవసరాల మేరకు యూరియా తెప్పించడంలో పూర్తిగా విఫలం అవుతున్నారని విమర్శలు లేకపోలేదు. సోమవా రం మార్కెట్‌ యార్డు వద్ద ఓ ఎరువుల దుకాణం లో యూరియా విక్రయాలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పీలేరు, పులిచెర్ల ఇతర మండలాల రైతులు పెద్ద సంఖ్యలో ఆ దుకాణం వద్దకు చేరుకున్నారు. ఓవైపు మండుటెండ, మరోవైపు ట్రాఫిక్‌ అయినా పట్టించుకోకుండా షాపు యజమాని రైతులను ఎండలో క్యూలో నిలబెట్టారు.


2MPL-MCU2.gifములకలచెరువులో యూరియా తీసుకునేందుకు వేచి ఉన్న రైతులు

మరోవైపు ఒక్కో రైతుకు ఒక మూటే ఇవ్వడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అవసరం మేరకు యూరియా దొరక్క పోవడంతో కొన్ని చోట్ల డీఏపీ కొంటనే యూరియా ఇస్తామని వ్యా పారులు మెలిక పెడుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ఒక్కో బస్తాపై రూ.30 నుంచి రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వరి, వేరుశనగ, ఇతర పంటలకు అదును కావడంతో రైతులు అధికంగా యూరియా కోసం పైబడుతున్నారు.

రైతులకు ‘యూరియా’ కష్టాలు

ములకలచెరువు, సెస్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): రైతులకు యూరియా కష్టాలు తొలగడం లేదు. స్థానిక ఓ ఎరువుల దుకాణంలో యూనియా విక్ర యిస్తున్నారని తెలియడంతో పెద్ద ఎత్తున రైతులు వచ్చారు. యూరియా తీసుకునేందుకు గంటల తరబడి పడిగాపులు కాశారు. రైతులు భారీగా తరలిరావడంతో చేసేది లేక దుకాణదారుడు టోక న్లు ఇచ్చాడు. వరుస క్రమంలో నెంబర్ల వారీ యూరియాను విక్రయించాడు. రెండు మూటల యూరియాను రూ.550కు కొనుగోలు చేసి తీసుకె ళ్తున్నట్లు రైతులు తెలియజేశారు. మండలంలో ఎక్కడా యూరియా దొరక్కపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - Sep 02 , 2025 | 10:48 PM