Share News

Visakhapatnam: గరుడ అయోధ్య రామ మందిరంపై తప్పుడు ప్రచారం..

ABN , Publish Date - Jul 22 , 2025 | 03:41 PM

విశాఖలో ఈనెల 29న అయోధ్య రాముడికి కల్యాణోత్సవం నిర్వహిస్తామని, దానికి రూ. 2,999 టికెట్‌ తీసుకోవాలని సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంపై విశాఖ గరుడ అయోధ్య నమూనా రామ మందిరం నిర్వాహకులు స్పందించారు. వారు ఏమన్నారంటే..

Visakhapatnam: గరుడ అయోధ్య రామ మందిరంపై తప్పుడు ప్రచారం..
Ayodhya Ram Mandir

విశాఖపట్నం: విశాఖలో ఈనెల 29న అయోధ్య రాముడికి కల్యాణోత్సవం నిర్వహిస్తామని, దానికి రూ. 2,999 టికెట్‌ తీసుకోవాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కొందరు ఫ్లెక్సీలు పెట్టి టికెట్లు కూడా విక్రయిస్తున్నారు. భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి దేవస్థానం పండితులు ఇక్కడికి వచ్చి కల్యాణం క్రతువు నిర్వహిస్తారని ప్రచారం చేశారు. అయితే, ఈ విషయంపై విశాఖ గరుడ అయోధ్య నమూనా రామ మందిరం నిర్వాహకులు స్పందించారు.


అయోధ్య రామ మందిరంపై కొందరు కుట్రతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అందుబాటులో లేకపోవడం వలన తప్పుడు వార్తలు సర్క్యూలేట్ అయ్యాయని క్లారిటీ ఇచ్చారు. కళ్యాణం పేరిట జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని వివరించారు. కొందరు కావాలనే తప్పుడు ప్రింటింగ్ చేస్తున్నారని, దీనిపై పోలీసుల దర్యాప్తు జరుగుతుందని మందిరం నిర్వాహకులు పేర్కొన్నారు.


విశాఖ సాగరతీరంలో ఏర్పాటు చేసిన గరుడ అయోధ్య నమూనా రామ మందిరం వద్ద ఈ నెల 29న కళ్యాణం నిర్వహించాలని నిర్ణయించామని కొండవీటి రామలింగేశ్వర శర్మ తెలిపారు. భద్రాచలం నుంచి బ్రాహ్మణ బృందం వచ్చి కళ్యాణం చేస్తారని, విశాఖ ప్రజలు కళ్యాణానికి హాజరు కావాలని కోరుతున్నట్లు తెలిపారు.


Also Read:

భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలు

ఏసీబీ కోర్టులో చెవిరెడ్డి ఎమోషనల్.. మద్యం వ్యాపారంపై తండ్రి చెప్పినట్టు..

For More Andhra Pradesh News

Updated Date - Jul 22 , 2025 | 03:41 PM