Share News

సెల్‌ఫోన వినియోగంతో కంటి సమస్యలు

ABN , Publish Date - Feb 17 , 2025 | 11:47 PM

విద్యార్థులు సెల్‌ ఫోనను అధికంగా వినియోగిస్తుండడంతోనే చిన్న వయసులోనే కంటి సమస్యలకు గురవుతున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.

 సెల్‌ఫోన వినియోగంతో కంటి సమస్యలు
కంటి అద్దాలు అందుకున్న విద్యార్థినులతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

- ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

ఆళ్లగడ్డ(శిరివెళ్ల), ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు సెల్‌ ఫోనను అధికంగా వినియోగిస్తుండడంతోనే చిన్న వయసులోనే కంటి సమస్యలకు గురవుతున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా ఆళ్లగడ్డ పట్టణం లోని గర్ల్స్‌ హైస్కూల్‌లో విద్యార్థినులకు కంటి అద్దాలను ఎమ్మెల్యే సో మవారం పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 11,200 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా వైద్యుల సిఫా రసు మేరకు 514 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల ను కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉ న్నత విద్యను అభ్యసించాలని ఎమ్మెల్యే ఆకాక్షించారు. సమావేశంలో ఎంఈవో శోభావివేకవతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

శాంతిభద్రతలను పరిరక్షించాలి : ఎమ్మెల్యే

శాంతిభద్రతలను పరిరక్షించేందుకు కృషి చేయాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. దొర్నిపాడు మండల ఎస్‌ఐగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన హనుమంతరెడ్డి ఎమెల్యే భూమా అఖిలప్రియ, భార్గవ్‌రామ్‌ దంపతులను సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి వారికి పుష్పగుచ్ఛం అందజేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎమ్మెల్యే ఎస్‌ఐకు సూచించారు.

Updated Date - Feb 17 , 2025 | 11:47 PM